Cylinder Price Hike: ఏప్రిల్ 1న కేంద్రం షాక్.. భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర
- ఏప్రిల్ 1న కేంద్రం షాక్
- భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర
- గృహ వినియోగదారులకు ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నాయి. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే.. ప్రభావం మాత్రం అన్ని దేశాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఆయా దేశాల్లో గ్యాస్, చమురు సంక్షోభం తీవ్రమవుతోంది. ఇప్పటికే భారతదేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై ఆంక్షలు ఉన్నాయి. పైగా గత నెలలో ఒకసారి ధర పెరిగినప్పటికీ గ్యాస్ దొరకడం లేదు. తాజాగా మరోసారి కేంద్రం షాకిచ్చింది. లేటెస్ట్‌గా 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.195.50కు పెంచింది. దీంతో కొత్త ధరతో వాణిజ్య సిలిండర్ రూ.2,000లకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ధర రూ.2,078.50కు చేరింది. ఇక గృహ వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది. గృహ వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం కాగానే మార్చి 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.114.50కు పెంచింది. మళ్లీ నెలరోజులు తిరిగి రాగానే రూ.195.50 పెంచింది. ఇక మార్చి 7న 14.2 కేజీల గృహ ఎల్‌పీజీ ధరలను రూ.60 పెంచారు. అప్పటి నుంచి ధరలు స్థిరంగా ఉన్నాయి.
Also Read
- Congress: భారత్‌పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన అంతర్జాతీయ ప్రమాణాలు, మారకపు రేట్ల ఆధారంగా ఎల్‌పీజీ, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను సమీక్షిస్తాయి. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులకు ఊరటనిచ్చి.. వాణిజ్యానికి షాకిచ్చారు.
వాహనదారులకు ఊరట
ఇదిలా ఉండగా యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నాయి. గతేడాది మార్చిలో లీటరుకు రూ.2 ధర తగ్గించినప్పటి నుంచి ఈ ధరల్లో మార్పు కనిపించలేదు. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.72, డీజిల్ లీటరుకు రూ.87.62 చొప్పున అమ్ముడవుతోంది.
తాజావార్తలు
-
Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్‌హౌస్
-
Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
-
Chicken Pachadi: ముక్క గట్టిపడదు.. ఆరు నెలలైన అస్సలు పాడవదు! చికెన్ పచ్చడి పక్కా కొలతలతో సీక్రెట్ రెసిపీ ఇదే..
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్‌ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!