CM Yogi Adityanath: ఆర్ఎస్ఎస్ చీఫ్‌ని కలవనున్న సీఎం యోగి.. ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామం..
- ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో భేటీ కానున్న యూపీ సీఎం..
- ఎన్నికల తర్వాత కీలక పరిణామం..
- ఆర్ఎస్ఎస్ విమర్శల నేపథ్యంలో కీలకంగా సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi Adityanath: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు , ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ని కలవనున్నట్లు తెలుస్తోంది. గురువారం గోరఖ్‌పూర్‌లో జరిగిన కార్యకర్త శిబిరానికి భగవత్ హాజరయ్యారు. బుధవారం నుంచి 5 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు సీఎం యోగి, మోహన్ భగవత్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
బీజేపీపై ఆర్ఎస్ఎస్ బయటికి చెప్పకున్నా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరసగా ఆర్ఎస్ఎస్ నేతలు బీజేపీ అహంకారంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. మణిపూర్ సమస్యపై సోమవారం మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా అక్కడ శాంతి నెలకొనలేదని కేంద్రాన్ని పరోక్షంగా విమర్శించారు. ప్రజాసేవలో వినయంగా వ్యవహరించాలని అన్నారు. ఇదిలా ఉంటే మరోనేత ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. అహంకారులుగా వ్యవహరించిన వారిని 241 వద్దే శ్రీరాముడు అడ్డుకున్నాడని అన్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
Read Also: Sehwag-Shakib: సెహ్వాగ్ ఎవరో నాకు తెలియదు.. షకీబ్ అల్ హసన్ కౌంటర్!
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో బీజేపీకి మద్దతు తెలపలేదని తెలుస్తోంది. సైద్ధాంతిక సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్‌ని బీజేపీ పట్టించుకోకపోవడంతోనే ఇది జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ పరాజయానికి ఇది ఓ కారణంగా చెబుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 36 సీట్లను సాధించింది. బీజేపీ 33 సీట్లకు పరిమితమైంది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)- కాంగ్రెస్ ఇండియా కూటమి 43 స్థానాలను గెలుచుకుంది. అయోధ్య రామాలయాన్ని నిర్మించిన ఫైజాబాద్ ఎంపీ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది.
ఉత్తర్ ప్రదేశ్ ఫలితాలు బీజేపీని మెజారిటీ మార్కుకు దూరం చేశాయి. గత రెండు పర్యాయాలు 2014, 2019లో బీజేపీ యూపీలో 60+కి పైగా సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ మెజారిటీ మార్క్(272)ని దాటింది. ఈసారి మాత్రం బీజేపీ 240 సీట్ల వద్దే ఆగిపోయింది. అయితే, ఎన్డీయే కూటమి మొత్తంగా 293 స్థానాలు సాధించింది. అధికారం కోసం టీడీపీ, జేడీయూ, శివసేనలపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో సీఎం యోగి భేటీ కాబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!