BrahMos Missile: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 300 కోట్ల రూపాయల ఖర్చుతో బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ యూనిట్ సుమారు 80 హెక్టార్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక, ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణిని ఉపయోగించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ధృవీకరించారు.
Read Also: Pulwama Attack: పుల్వామా ఉగ్రవాద దాడిలో మా ప్రమేయం ఉంది.. అంగీకరించిన పాక్ సైన్యం
అయితే, ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి శక్తి స్పష్టంగా కనిపించిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కాగా, ఎవరైనా దానిని మిస్ అయితే, బ్రహ్మోస్ పని తీరు గురించి తెలుసుకోవాలనుకుంటే పాకిస్తాన్‌ను అడగవచ్చని అన్నారు. ఇక, ఉగ్రవాదం కుక్క తోక లాంటిది.. అది ఎప్పుడూ నిటారుగా ఉండదన్నారు. అయితే, మున్ముందు జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు.. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు.. టెర్రరిజం నివారణ కోసం మోడీ నాయకత్వంలో మనమందరం కలిసి పోరాడాలని యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.
