CM Vijay First Signatures: సీఎం విజయ్ తొలి సంతకాలు సంచలనం.. ఇక, ఇవి ఫ్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay First Signatures: తమిళనాడులో కొత్త రాజకీయ శకానికి శ్రీకారం చుడుతూ టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ అర్లేకర్ విజయ్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. విజయ్‌తో పాటు మరో 9 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయ్‌కు ఘన స్వాగతం పలికారు.
తొలి సంతకాలతోనే కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే పథకాలకే ప్రాధాన్యత ఇస్తూ ఆయన తొలి నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్‌పై సీఎం విజయ్ తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని మధ్యతరగతి, పేద కుటుంబాలకు భారీ ఊరటనివ్వనుంది. అదే విధంగా మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహిళా భద్రతపై రెండో సంతకం చేసిన విజయ్, షీటీమ్ తరహాలో ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
Also Read
- Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
- UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
- IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
డ్రగ్స్ నిరోధానికి స్పెషల్ టీమ్
రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక డ్రగ్స్ నిరోధక బృందాన్ని ఏర్పాటు చేస్తూ సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తూ కూడా సీఎం విజయ్ సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మహిళలకు ప్రయాణ ఖర్చులో ఉపశమనం కలగనుంది. ఇక, ప్రమాణస్వీకారం అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన విజయ్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. “నేను మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిని. మీకు అన్నగా, తమ్ముడిగా ఉంటాను. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు” అంటూ ప్రజలతో తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
-
Shruti Haasan: AI డీప్‌ఫేక్‌లపై శృతి హాసన్‌కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
-
Redmi 17 5G: రెడ్ మీ 17 5G భారత్‌లో లాంచ్.. 7900mAh బ్యాటరీ.. 50MP కెమెరా!.. ధర, ఫీచర్లు ఇవే
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
-
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!