Site icon NTV Telugu

Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం.. ట్రిపులైన పెన్షన్లు!

Nitish

Nitish

Nitish Kumar: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్‌లోని వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు అందించే పింఛను సొమ్మును పెంచేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.400 పెన్షన్ మొత్తాన్ని దాదాపు ట్రిపుల్‌ చేసి.. రూ.1,100లకు పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Nani : ఆ విషయంలో.. సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన న్యాచురల్ స్టార్ !

అయితే, పెంచిన పెన్షన్లు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల కోటి మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు అందుతాయి. సామాజిక భద్రతా పింఛన్‌ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులైన మహిళలు అందరికీ ఇకపై రూ.1,100 మా ప్రభుత్వం అందించనుంది అని ప్రకటించారు. ఈ విషయం మీకు తెలియజేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది.. జులై 1 నుంచి లబ్ధిదారులకు ఈ మొత్తం పెన్షన్ పంపిణీ చేయనున్నామని తేల్చి చెప్పారు. అదే నెల 10వ తేదీ వరకు అందరికీ అందించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం నితీశ్ కుమార్ పేర్కొన్నారు.

Read Also: DGCA: ఎయిర్ ఇండియాపై డీజీసీఏ కఠిన చర్యలు.. ముగ్గురు అధికారులను తొలగించాలని ఆదేశాలు

కాగా, బీహార్ రాష్ట్రంలోని వృద్ధులు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకే మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. ఆ దిశగా తాము కృషి చేస్తున్నాం అని ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు. ఇదిలాఉండగా.. ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు జనతాదళ్‌ (యూనైటెడ్‌), ఎన్డీయే, ఆర్జేడీ తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్‌ తన ఎన్నికల వ్యూహాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

Exit mobile version