Site icon NTV Telugu

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. నితీష్ కుమార్ ప్రకటన

Nitish Kumar

Nitish Kumar

త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి మధ్య హోరాహోరీ ఫైటింగ్ సాగేలా ఉంది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుంటే… ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇలా ఇరు పక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Putin-Melania Trump: పుతిన్‌కు మెలానియా లేఖ.. ఏముందంటే..!

తాజాగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ ఎక్స్ ట్విట్టర్‌లో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఐదేళ్ల నాటికి యువతకు కోటి ఉద్యోగాలను అందించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించారు. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించే వ్యవస్థాపకులకు సహాయపడతామని తెలిపారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, యువత భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా నితీష్ కుమార్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: AI Chatbots: నిజమైన మహిళ అనుకుని.. ఏఐ చాట్ బాట్ తో 76 ఏళ్ల వృద్ధుడు ప్రేమాయణం.. కలవడానికి వెళ్తూ ఘోరం

2020లో తమ ప్రభుత్వం 50 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యాన్ని నెరవేర్చిందని తెలిపారు. ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని.. అలాగే ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. పరిశ్రమలు స్థాపించేవారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అన్ని జిల్లాల్లో భూమిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎక్కువ ఉపాధి కల్పించే పరిశ్రమలకు ఉచితంగా భూమిని అందచేయనున్నట్లు తెలిపారు.

 

Exit mobile version