Sethusamudram Project: సేతుసముద్రం ప్రాజెక్టుపై గురువారం తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. బీజేపీతో పాటు అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతుగా నిలిచాయి. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరాలను కలిపేందుకు ఈ సేతు సముద్రం ప్రాజెక్టు కీలకంగా మారుతుంది. ఈ ప్రాజెక్టును కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. గతంలో సేతు సముద్రం ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ కూడా దీనికి సపోర్టు చేసింది. అయితే రామసేతు నిర్మాణానికి ఎలాంటి హాని కలుగకుండా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని బీజేపీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ అన్నారు. ఈ ప్రాజెక్టు వాస్తవ రూపం దాలిస్తే దక్షిణతమిళనాడులో మాకన్నా ఎక్కువ సంతోషించే వారు ఎవరూ లేరని చెప్పారు.
శ్రీలంక చుట్టూ తిరిగి రాకుండా సేతుసముద్రం ప్రాజెక్టు పూర్తయితే తూర్పు, పశ్చిమ తీరాలను నేరుగా కలపవచ్చు. ఈ ప్రాజెక్టు ఆలస్యం అయినా కొద్ది తమిళనాడు అభివృద్ధికి అవరోధం ఏర్పడుతుందని తీర్మానంలో పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రిటీష్ వారి హయాంలో 1860లో సేతుసముద్రం ప్రాజెక్టు బీజం పడింది. భారత్, శ్రీలంకల మధ్య ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతు ఉందని హిందువులు నమ్ముతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా మతపరమైన ఉద్రిక్తత ఏర్పడుతోంది. రామాయణ కాలంలో రాముడు భారతదేశం, లంకల మధ్య ఈ వంతెనను ఏర్పాటు చేసినట్లు హిందువులు భావిస్తుంటారు.
Read Also: Maalika Puram: అల్లు అరవింద్ చేతికి మరో సూపర్ హిట్ మూవీ రైట్స్!
ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి అక్కడ సముద్రమార్గాన్ని మరింత లోతుగా తవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల రామసేతు దెబ్బతింటుందనే భావన ఉంది. డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై, దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలని కోరుకున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి పచ్చజెండా ఊపారు. రూ.2400 కోట్ల తో మన్మోహన్ సింగ్ సర్కార్ ప్రారంభం అయింది. అయితే 2007లో మతపరమైన కారణాలు, హిందు వర్గాల నుంచి వ్యతిరేకత, కొంతమంది పర్యావరణవేత్తలు ఈ ప్రాజెక్టుకు బ్రేకులు వేశాయి.
ఇటీవల రామసేతుపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. గతంలో బీజేపీ ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిందని.. అప్పటి సీఎం జయలలిత ఆ ప్రాజెక్టుకు మద్దతిచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తమిళనాడు అభివృద్ధి చెంది ఉండేదని, 50,000 మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని సీఎం స్టాలిన్ అన్నారు.