Site icon NTV Telugu

ఢిల్లీలో దీదీ బిజీ.. సోనియాతో భేటీ

Sonia Gandhi

Sonia Gandhi

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. హస్తిన పర్యటనలో బిజి బీజీగా ఉంది. మిషన్ మోడీ ఉద్వాసనకు రంగం సిద్ధం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా మమత.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో సమావేశం కానున్నారు. ప్రధానంగా పెగసస్‌ స్పైవేర్‌ ఆరోపణలు, పెట్రో ధరల పెంపు సహా కీలకాంశాలపై… పార్టీలు ఎలా వ్యవహరించాలన్న అంశంపైనా చర్చించే అవకాశముంది. పెగసస్‌ స్పైవేర్‌లో మమత పార్టీకి చెందిన అభిషేక్ బెనర్జీ పేరుండడం.. దీన్ని కక్షసాధింపుగా కాంగ్రెస్ నేతలు ట్వీట్ చేయడం తర్వాతి పరిణామాలు.. ఇరు పార్టీల మధ్య సఖ్యతను కనబరుస్తున్నాయి. మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ మారింది.

Exit mobile version