NTV Telugu Site icon

CM KCR Meets LaluPrasad Yadav: లాలూప్రసాద్ యాదవ్ తో కేసీఆర్ భేటీ

Lalu1

Lalu1

బీహార్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో సుదీర్ఘ భేటీ అనంతరం బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్. తేజస్వీ యాదవ్ తండ్రి….మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను పలకరించి ఆయన ఆరోగ్యం, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. లాలూ నివాసంలో ఆయనతో కలిసి తేనీరు సేవించారు. సమకాలీన రాజకీయ అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యుల్ని కేసీఆర్ పలకరించారు. గతంలో అనారోగ్యంతో బాధపడుతోన్న లాలూ ప్రసాద్ యాదవ్ తన ఇంట్లో జారిపడి పడటంతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయన కోలుకున్నారు. తేజస్వితో కలిసి సీఎం కేసీఆర్ లాలూని కలిశారు.

Read Also: CM Jagan: కడప జిల్లాలో మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!!

అంతకుముందు బీజేపీ ముక్త్ భారత్ కోసం విపక్షాలు కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చామన్నారు సీఎం కేసీఆర్. బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని, అందుకే దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని, ఈ విషయం గురించి నితీశ్‌తో కూడా చర్చించామని చెప్పారు. దేశానికి రొటీన్ ప్రభుత్వాలు వద్దని, భారత్‌ను మార్చే ప్రభుత్వం రావాలని చెప్పారు. బీజేపీ కేవలం అబద్ధాలతోనే పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో విపక్షాలను ఏకం చేసే విషయమై నితీశ్‌తో చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు.

 

కేంద్ర దర్యాప్తు సంస్థ‌ల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విపక్షాలను బలహీనరపరిచేందుకు దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటోందని కేంద్రంపై మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థ‌ల‌ను అడ్డం పెట్టుకుని న‌రేంద్ర మోదీ స‌ర్కారు ఆయా రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. శాంతిభ‌ద్ర‌త‌లు రాష్ట్రాల ప‌రిధిలోని అంశమ‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు. సీబీఐ ప్ర‌వేశాన్ని నిరాక‌రిస్తూ బీహార్ తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నాన‌న్న కేసీఆర్‌.. మిగిలిన అన్ని రాష్ట్రాలు ఇదే ప‌ని చేయాలని పిలుపునిచ్చారు.

Read Also: Kadiam Constable: ఆమెతో కానిస్టేబుల్ రాసలీలలు.. నడిరోడ్డుపై నగ్నంగా