Site icon NTV Telugu

Zubeen Garg: జుబీన్ గార్గ్ మరణంపై అసెంబ్లీలో సీఎం హిమంత కీలక ప్రకటన

Zubeen Garg

Zubeen Garg

అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణంపై ముఖ్యమంత్రి హిమంత శర్మ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ మాట్లాడుతూ.. జుబీన్ గార్గ్‌ది నేరపూరిత కుట్రగా తేల్చారు. జుబీన్ గార్గ్ ప్రమాదంతో చనిపోలేదని.. హత్య గావించబడ్డారని వెల్లడించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రతిపాదించిన వాయిదా తీర్మానంలో ముఖ్యమంత్రి హిమంత శర్మ క్లారిటీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Mohan Bhagwat: ప్రపంచానికి శాంతి, శ్రేయస్సును ఇచ్చిన ధ్వజం శిఖరమెక్కింది

జుబీన్ గార్గ్‌ను ఒకరు హత్య చేస్తే.. కొందరు అతనికి సహాయం చేశారని వెల్లడించారు. హత్య కేసులో నలుగురైదుగురు వ్యక్తులపై కేసు నమోదైందని చెప్పారు. దేశ వ్యాప్తంగా 60 కేసులు నమోదయ్యాక.. రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. గౌహతి హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ సౌమిత్ర సైకియా నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేరం వెనుక ఉన్న ఉద్దేశం రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ఇక సింగపూర్ పోలీస్ ఫోర్స్ (SPF) కూడా స్వతంత్ర దర్యాప్తు నిర్వహిస్తోందన్నారు.

ఇది కూడా చదవండి: PM Modi-Ayodhya: ధ్వజారోహణతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు పోయాయి

జుబీన్ గార్గ్ సింగపూర్‌లోని నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌‌కు వెళ్లారు. సెప్టెంబర్ 19న సముద్రంలో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయారు. జుబీన్ గార్గ్ మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. అస్సాంలో 60కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. కేసును సిట్ దర్యాప్తు చేసింది. ఈ కేసులో మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఈవెంట్ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత, బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో-సింగర్ అమృత్‌ప్రవ మహంతను అరెస్ట్ చేశారు. వీరిపై హత్య అభియోగాలు నమోదు చేశారు.

 

Exit mobile version