CM Bhagwant Mann: ఖలిస్తానీ వేర్పాటువాదులు, రాడికల్ సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’ కార్యకర్తలు, దాని చీఫ్ అమృత్ పాల్ సింగ్ అజ్నాలాలోని పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న పంజాబ్ లో మళ్లీ ఖలిస్తాన్ పేరుతోె విభజన బీజాలు నాటాలని ప్రయత్నిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ అనుచరుడు జైలులో ఉన్న లవ్ ప్రీత్ సింగ్ తూఫాన్ ను విడిపించేందుకు పెద్ద ఎత్తున ఖలిస్తానీ వేర్పాటువాదులు కత్తులు, ఇతర ఆయుధాలతో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు.
Read Also: Shocking: పాము కాటుతో చనిపోయాడు.. అంత్యక్రియలు చేసిన 15ఏళ్లకు తిరిగివచ్చాడు
ఇదిలా ఉంటే ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. కేవలం 1000 మంది పంజాబ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించరని అన్నారు. రాష్ట్రంలో శాంతికి భంగం కలిగించే ప్రయత్నంలో పాకిస్తాన్ వారికి నిధులు సమకూర్చిందని ఆరోపించారు. విదేశీ శక్తులు, ముఖ్యంగా పాకిస్తాన్ నిధులు సాయంతో ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని అన్నారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ పోలీసుల నుంచి నివేదిక కోరింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అజ్నాలా ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రమైందని, పంజాబ్ లో శాంతి భద్రతలు కుప్పకూలాయిని అన్నారు. హింసకు పాల్పడిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ అన్నారు. అజ్నాలా సంఘటనలో మొత్తం ఐదుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. ఎస్పీ కూడా గాయపడ్డారు. పోలీసుల వాంగ్మూాలాన్ని రికార్డ్ చేసుకుని చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులపై దాడిని పిరికిపంద చర్యగా డీజీపీ అభివర్ణించారు. పోలీసులు గురుగ్రంథ సాహిబ్ పవిత్రతను పరిగణనలోకి తీసుకుని అత్యంత సంయమనంతో పనిచేశారని అన్నారు.
