NTV Telugu Site icon

Covid-19: ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులపై కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమీక్ష

Arvind Kejriwal

Arvind Kejriwal

Covid-19: దేశంలో మళ్లీ కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది. గత నెల వరకు వందల్లో ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వేలల్లో నమోదు అవుతోంది. మరోవైపు ఢిల్లీలో కూడా కేసుల సంఖ్య పెరగడంపై అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిాంచారు. పెరుగుతున్న కేసులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కోవిడ్ పెరుగుదలపై ఢిల్లీ వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఢిల్లీ సర్కార్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.

Read Also: Bengaluru: పార్కు నుంచి ఈడ్చుకెళ్లి.. కదిలే కారులో యువతిపై గ్యాంగ్ రేప్

కోవిడ్ రోగుల కోసం ఢిల్లీ ఆస్పత్రుల్లో 7,986 పడకలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం వద్ద తగినంద ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నట్లు సమావేశంలో పేర్కొన్నారు. కోవిడ్ XBB 1.16 వేరియంట్ వల్ల ప్రస్తుతం ఢిల్లీలో కేసులు సంఖ్య పెరుగుతోంది. ఈ వేరియంట్ వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు కూడా కరోనా సోకుతోంది. నిన్న ఢిల్లీలో 295 కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు చనిపోయారు. కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ చేస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.