24 Airports Closed: భారత్-పాకిస్తాన్ మధ్య హై టెన్షన్.. 24 ఎయిర్‌పోర్టులు బంద్
- భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత..
- 24 ఎయిర్‌పోర్టులను మూసివేసిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ..
- మే 15వ తేదీ వరకు ఎయిర్‌పోర్టులు బంద్: విమానయాన మంత్రిత్వ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
24 Airports Closed: భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల్లోని 24 విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మే 15వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొనింది. అయితే, ఇప్పటికే పలు విమానయాన సంస్థలు ఈ విమానాశ్రయాలకు తమ విమానాలను రద్దు చేసుకున్నాయి. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్కోట్లకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు విమానాలను రద్దు చేయడంతో ప్రయాణీకులకు పూర్తి నగదును వాపసు చేయడం లేదా రీబుక్ నుంచి మినహాయింపును అందిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
Read Also: Murali Naik: మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం: ఏపీ సీఎం
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇక, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం ఖచ్చితమైన దాడి ప్రారంభించింది. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగింది. దీంతో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామాబాద్ డ్రోన్, క్షిపణి దాడులకు దిగింది. వీటిని భారత రక్షణ వ్యవస్థలు సక్సెస్ ఫుల్ గా అడ్డుకున్నాయి. అయితే, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానయాన రంగంలో భద్రతను పెంచారు. విమానయాన సంస్థలు ప్రయాణీకులు బయలుదేరడానికి కనీసం మూడు గంటల ముందు ఎయిర్ పోర్టులకు చేరుకోవాలని సూచించాయి.
Read Also: Nawaz Sharif: భారత్‌తో ఉద్రిక్తత.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ కీలక సలహా..
మూసివేసిన విమానాశ్రయాలు ఇవే..
పంజాబ్: అమృత్సర్, లూధియానా, పాటియాలా, భటిండా, హల్వారా, పఠాన్‌కోట్
హిమాచల్ ప్రదేశ్: భుంటార్, సిమ్లా, కాంగ్రా-గగ్గల్
చండీగఢ్: చండీగఢ్
జమ్మూ & కాశ్మీర్: శ్రీనగర్, జమ్మూ
లడఖ్: లెహ్
రాజస్థాన్: కిషన్‌గఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, బికనీర్
గుజరాత్: ముంద్రా, జామ్‌నగర్, హిరాసర్, పోర్ బందర్, కేశోద్, కాండ్లా, భుజ్
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!