Site icon NTV Telugu

24 Airports Closed: భారత్-పాకిస్తాన్ మధ్య హై టెన్షన్.. 24 ఎయిర్పోర్టులు బంద్

Airports

Airports

24 Airports Closed: భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల్లోని 24 విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మే 15వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొనింది. అయితే, ఇప్పటికే పలు విమానయాన సంస్థలు ఈ విమానాశ్రయాలకు తమ విమానాలను రద్దు చేసుకున్నాయి. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్‌లకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు విమానాలను రద్దు చేయడంతో ప్రయాణీకులకు పూర్తి నగదును వాపసు చేయడం లేదా రీబుక్ నుంచి మినహాయింపును అందిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

Read Also: Murali Naik: మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం: ఏపీ సీఎం

ఇక, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం ఖచ్చితమైన దాడి ప్రారంభించింది. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగింది. దీంతో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామాబాద్ డ్రోన్, క్షిపణి దాడులకు దిగింది. వీటిని భారత రక్షణ వ్యవస్థలు సక్సెస్ ఫుల్ గా అడ్డుకున్నాయి. అయితే, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానయాన రంగంలో భద్రతను పెంచారు. విమానయాన సంస్థలు ప్రయాణీకులు బయలుదేరడానికి కనీసం మూడు గంటల ముందు ఎయిర్ పోర్టులకు చేరుకోవాలని సూచించాయి.

Read Also: Nawaz Sharif: భారత్‌తో ఉద్రిక్తత.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ కీలక సలహా..

మూసివేసిన విమానాశ్రయాలు ఇవే..
పంజాబ్: అమృత్‌సర్, లూధియానా, పాటియాలా, భటిండా, హల్వారా, పఠాన్‌కోట్
హిమాచల్ ప్రదేశ్: భుంటార్, సిమ్లా, కాంగ్రా-గగ్గల్
చండీగఢ్: చండీగఢ్
జమ్మూ & కాశ్మీర్: శ్రీనగర్, జమ్మూ
లడఖ్: లెహ్
రాజస్థాన్: కిషన్‌గఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, బికనీర్
గుజరాత్: ముంద్రా, జామ్‌నగర్, హిరాసర్, పోర్ బందర్, కేశోద్, కాండ్లా, భుజ్

Exit mobile version