CJP: కేసులు ఎత్తేయాలి, లేదంటే.. కేంద్రానికి కాక్రోచ్ అల్టిమేటం..
- ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కేంద్రంపై సీజేపీ ఆరోపణ
- ఎఫ్ఐఆర్లు ఉపసంహరించాలని డిమాండ్
- విద్యార్థుల అరెస్టులు, వాలంటీర్ల వేధింపులపై ఆందోళన
- లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: నిరసనకారులపై పోలీసు చర్యలు కొనసాగుతున్నాయని, కేసుల ఉపసంహరణనపై కేంద్రం తమకు ఇచ్చిన మాటను ఉల్లంఘిస్తోందని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆరోపించింది. మళ్లీ దేశవ్యాప్త నిరసనలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. కేంద్ర విద్యశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ తన నిరసనను విరమించింది. కేంద్రంతో చర్చల సమయంలో విద్యార్థులపై కేసులు ఎత్తివేతపై కేంద్రం అంగీకరించిందని సీజేపీ చెబుతోంది. కేసులు విత్ డ్రా చేయకుపోతే రేపటి నుంచి మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరించారు.
నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను (FIRs) వెంటనే ఉపసంహరించుకోవాలని, అదుపులోకి తీసుకున్న విద్యార్థులను విడుదల చేయాలని మరియు వాలంటీర్లపై నిఘా, వేధింపులను ఆపాలని సీజేపీ డిమాండ్ చేసింది. నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తోదని సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా ఎక్స్‌లో ఆరోపించారు. బీహార్, బెంగాల్‌లలో వందలాది విద్యార్థుల్ంని అరెస్ట్ చేస్తున్నారని, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో వందలాది మందిపై నిఘా ఉంచి వేధిస్తున్నారని, నిరసనకారులకు లాజిస్టిక్స్ సపోర్ట్ అందించిన వాలంటర్లను వేధిస్తున్నారని ఆరోపించారు.
Also Read
- Sonam Wangchuk: ఈనాటికీ బాపూనే ఆదర్శం.. రాజ్‌ఘాట్‌లో సోనమ్ వాంగ్‌చుక్ నివాళి
- CM Vijay: మద్రాస్ హైకోర్టులో విజయ్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ
- Delhi Protest: కేసుల విత్‌డ్రాపై ఆదేశాలు లేవు.. సీజేపీ నిరసనపై ఢిల్లీ పోలీసులు..
- IndiGo Flight: దుబాయ్-ముంబై ఇండిగో విమానంలో మంటలు.. రాజ్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, మరియు బీజేపీ పాలిత లేదా బీజేపీ మిత్రపక్ష రాష్ట్రాల్లోని ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు లేదా పోలీసు బలగాలు కొత్త కేసులు నమోదు చేయకూడదని సీజేపీ డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మళ్లీ నిరసనలో కూర్చుంటామని కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. కేసులు ఎత్తేస్తామనే హామీని లిఖితపూర్వకంగా తమకు బుధవారం లోగా ఇవ్వాలని సీజేపీ కోరింది.
సోమవారం నాడు సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది మరియు ఎస్పీ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో, సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించిన తర్వాత జూలై 25న ఆందోళనను విరమించుకున్నామని, అయితే ఆందోళన తగ్గుముఖం పట్టిన కొద్దీ విద్యార్థులను ఒక్కొక్కరిగా లక్ష్యంగా చేసుకుంటారని తాము ముందే ఊహించామని తెలిపారు. కేసుల్లో చిక్కుకున్న విద్యార్థుల న్యాయసహాయం కోసం ‘‘సాక్షి’’ అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించినట్లు సీజేపీ ప్రకటించింది.
తాజావార్తలు
-
CJP: కేసులు ఎత్తేయాలి, లేదంటే.. కేంద్రానికి కాక్రోచ్ అల్టిమేటం..
-
Telangana : తెలంగాణ ప్రజలకు త్వరలో ‘కుటుంబ రిజిస్టర్’
-
Sonam Wangchuk: ఈనాటికీ బాపూనే ఆదర్శం.. రాజ్‌ఘాట్‌లో సోనమ్ వాంగ్‌చుక్ నివాళి
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!