CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
- ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన CJP కార్యకర్తలపై దాడి ఆరోపణలు.
- రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్‌కు 48 గంటల అల్టిమేటం.
- దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్.
- దాడికి పాల్పడిన వారు బీజేపీ గుండాలే అనే ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: రాజస్థాన్ రాష్ట్రంలో పాఠశాల పర్యటనకు వెళ్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై గ్రామస్తులు దాడి చేయడం సంచలనంగా మారింది. అయితే, బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడినట్లు సీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు, దాడి చేసిన గ్రామస్తులు తమకు బీజేపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేదని చెబుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా రాజస్థాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం విధించారు. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ లాల్ రాజీనామాను కోరుతున్నారు.
దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలనున ప్రజలు స్వయంగా పరిశీలించడంపై విధించిన ఆంక్షల్ని ఉపసంహరించుకోవాని రాంకా డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను 48 గంటల్లో తీర్చకపోతే రాజస్థాన్ వ్యాప్తంగా భారీ ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ సారి తమ పోరాటం కేవలం పాఠశాలల సమస్యలకే పరిమితం కాదని, విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ రాజీనామాను డిమాండ్ చేస్తామని హెచ్చరించారు.
Also Read
- Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
- CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్‌లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
శుక్రవారం ఉదయం రాంపురా-కన్వార్పురా గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు సీజేపీ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించేందుకు పార్టీ కార్యకర్తలు అక్కడి వెళ్లారని, ఈ పాఠశాల కొన్నేళ్లుగా పశువుల కొట్టంలోనే కొనసాగుతోందని రాంకా ఆరోపించారు. బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తులు తమపై దాడి చేసినట్లు చెప్పారు. తమ వాహనాల అద్దాలు పగులగొట్టారని, మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని, ఓ మహిళా కార్యకర్తపై దాడి చేశారని, తన చొక్కాను చించేశారని రాంకా ఆరోపించారు. పోలీసులు ముందే సమాచారం ఇచ్చినా ఘర్షణను అడ్డుకోలేదని చఅన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకే దాడి జరిగిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!