CJP: పంజాబ్, కర్ణాటక పేపర్ లీకుల మాటేమిటి.. కాక్రోచ్ల మౌనం ఎందుకు..?
- పంజాబ్ పేపర్ లీక్ వివాదంపై సీజేపీ మౌనం..
- యువత నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు కాక్రోచ్ పార్టీ దూరం..
- వైరల్ అవుతున్న కాక్రోచ్ లీడర్ల వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్తగా ప్రహ్లాద్ జోషి ఈ శాఖ బాధ్యతలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు యువత నుంచి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కు కొత్త డిమాండ్ ఎదురవుతోంది. పంజాబ్, కర్ణాటక పేపర్ లీకులపై స్పందించాలని కోరుతున్నారు. ఈ రాష్ట్రాల్లో కూడా విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేసేలా ఉద్యమం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ డిమాండ్లపై సీజేపీ నుంచి మౌనమే ఎదురవుతోంది.
పంజాబ్‌లో ఇటీవల ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఫార్మసీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఎగ్జామ్‌లో అక్రమాలు జరిగాయి. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ ఆరోపిస్తోంది. పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హర్జోత్ సింగ్ బైన్స్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. పంజాబ్ పీసీసీ చీఫ్ అమరిందర్ సింగ్ రాజా వారింగ్ మాట్లాడుతూ.. కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, విద్యాశాఖ మంత్రి బైన్స్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, సీజేపీ పంజాబ్ అంశంపై ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తుందని బీజేపీ ప్రశ్నిస్తోంది. కేవలం సెలెక్టివ్‌గా ఉద్యమం చేస్తున్నారని విమర్శిస్తోంది.
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో కూడా పేపర్ లీక్ అంశం ప్రస్తావనకు వస్తోంది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ నిర్వహించిన పరీక్షపై ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ, ఆ రాష్ట్ర మంత్రి మధు బంగారప్ప రాజీనామాను కోరుతోంది. ప్రధాన్ రాజీనామా విషయంలో బీజేపీపై ఒత్తిడి పెంచిన కాంగ్రెస్, తన ప్రభుత్వంలోని మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తోంది.
మరోవైపు, సీజేపీ లీడర్లు పంజాబ్ పేపర్ లీక్ అంశంపై మాట దాటేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాన్ రాజీనామా తర్వాత జంతర్ మంతర్ వద్దకు వచ్చిన ఆప్ నేత మనీష్ సిసోడియాను అక్కడ ఉన్న విద్యార్థులు ప్రశ్నించడం వైరల్ అవుతోంది. కాక్రోచ్ పార్టీ సీనియర్ నాయకులు సౌరభ్, అశుతోష్ రాణాలను ఒక జర్నలిస్ట్ పంజాబ్ పేపర్ లీక్ గురించి ప్రశ్నించిన నేపథ్యంలో వారు సమాధానాలు చెప్పకుండా కారులో వెళ్లిపోతున్న వీడియో వైరల్‌గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్‌పై మాట్లాడిన గొంతుకలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అవుతున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Journalist: Will we also see protests by CJP in Punjab and Karnataka on paper leak?
Senior Cockroaches Saurabh and Ashutosh Ranka……closed the car door and fled! pic.twitter.com/D9sIJT8Xb5
— Megh Updates 🚨™ (@MeghUpdates) July 25, 2026
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!