CJP Protest: 3 డిమాండ్లు కేంద్రం అంగీకరించింది.. ఆందోళన విరమించినట్లుగా సీజేపీ ప్రకటన
- 3 డిమాండ్లు కేంద్రం అంగీకరించింది
- ఆందోళన విరమించినట్లుగా సీజేపీ ప్రకటన
- ప్రెస్‌మీట్ అనంతరం కేంద్రమంత్రులు కరచాలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించిందని.. దీంతో ఆందోళనను విరమించుకుంటున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే శనివారం కేంద్ర పెద్దలతో సీజేపీ ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేంద్రమంత్రులతో కలిసి సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం అంగీకరించిందని.. తాము తమ నిరసనను విరమించుకుంటున్నామని ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌ను ఈ ఉదయం ప్రభుత్వం అంగీకరించిందని సీజేపీ ప్రతినిధి బృందం పేర్కొంది. మంగళవారం నాటికి తమ ఇతర డిమాండ్లను కూడా నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు.
‘‘మేము ప్రభుత్వ ప్రతినిధి బృందంతో మూడు విడతలుగా చర్చలు జరిపాము. కొన్ని రోజులుగా జంతర్ మంతర్ దగ్గర మేము చేస్తున్న నిరసనలో మూడు ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిరసనకారులు, నిర్వాహకులపై దాఖలైన అన్ని చట్టపరమైన కేసులను ఉపసంహరించుకోవాలి. భవిష్యత్తులో నిరసనకారులు లేదా నిర్వాహకులపై ఎలాంటి కేసులు పెట్టకూడదు. నీట్ పరీక్ష వాయిదా పడటంతో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్నది మా మూడవ డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు. అంటే మా మొదటి డిమాండ్ అంగీకరించబడినట్టే.’’ అని జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా తెలిపారు.
Also Read
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హాజరుకాగా.. సీజేపీ ప్రతినిధి బృందంలో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఉన్నారు. సీజేపీ ఆందోళనను విరమించుకున్న అనంతరం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ ప్రతినిధి అశుతోష్ రాంకాతో కరచాలనం చేశారు.
#WATCH दिल्ली: सरकार से बातचीत के बाद कॉकरोच जनता पार्टी के नेशनल स्पोक्सपर्सन आशुतोष रांका ने कहा, “हमने सरकारी डेलीगेशन के साथ 3 राउंड की बातचीत की। जंतर-मंतर पर हमारा प्रोटेस्ट, जो कई दिनों से चल रहा था, उसकी तीन मेन डिमांड थीं: धर्मेंद्र प्रधान का इस्तीफा, प्रोटेस्टर्स और… pic.twitter.com/xpH4fMnpwq
— ANI_HindiNews (@AHindinews) July 25, 2026
#WATCH दिल्ली: सरकार से बातचीत के बाद कॉकरोच जनता पार्टी(CJP) के मुख्य प्रवक्ता सौरव दास ने कहा, “हमारी दूसरी मांग थी कि प्रदर्शनकारियों के खिलाफ दर्ज सभी FIR, सिर्फ दिल्ली में ही नहीं बल्कि सभी भाजपा शासित और भाजपा सहयोगी राज्यों में, वापस ली जाएं। यह भी हमारी दूसरी मांग थी।… pic.twitter.com/LA57ykgR71
— ANI_HindiNews (@AHindinews) July 25, 2026
#WATCH | दिल्ली: कॉकरोच जनता पार्टी के आंदोलन वापस लेने के बाद केंद्रीय मंत्री जे.पी. नड्डा और जितेंद्र सिंह ने कॉकरोच जनता पार्टी के मुख्य प्रवक्ता सौरव दास और राष्ट्रीय प्रवक्ता आशुतोष रांका से हाथ मिलाया। pic.twitter.com/wUam8Oxxjy
— ANI_HindiNews (@AHindinews) July 25, 2026
తాజావార్తలు
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!