CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?

  • గౌహతిలో అశుతోష్ రాంకా సహా CJP కార్యకర్తల నిర్బంధం
  • వాలంటీర్ మీట్‌కు ముందే పోలీసుల చర్య
  • రాంకాను గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని CJP ఆరోపణ
  • నేను అస్సాం వెళ్తున్నానని అభిజిత్ దీప్కే ప్రకటన
Cjp (1)

Cjp (1)

CJP:  అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఆ పార్టీ కో కన్వీనర్ అశుతోష్ రాంకాను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం గౌహతిలో సీజేపీ వాలంటీర్ సమావేశానికి ముందే రాంకాను అదుపులోకి తీసుకున్నారు. తమ సభ్యుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని సీజేపీ ఆరోపిస్తోంది. అశోతోష్ రాంకాను గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు.

సీజేపీ పరిస్థితిని చూస్తే అంతా అస్సామే అనే ఫేమస్ సినిమా డైలాగ్ గుర్తుకువస్తోంది. ఇప్పుడు, అభిజిత్ దీప్కే కూడా అస్సాం వెళ్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘పోలీసులు అశును ఇంకా విడుదల చేయకపోవడంతో, రేపు ఉదయం అస్సాం వెళ్తున్నాను. అరెస్ట్ లేదా జైలు బెదిరింపులకు మేము తలొగ్గే ప్రసక్తే లేదు. రేపు విమానాశ్రయంలో నన్ను అరెస్ట్ చేయడానికి నిరభ్యంతరంగా ముందుకు రావచ్చు’’ అని పోస్ట్ చేశారు.

ఈ పరిస్థితిని చూస్తే అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ‘‘హిమంతా మాతో పెట్టుకోవద్దు’’ అని సీజేపీ డైరెక్ట్ బెదిరింపులకు దిగుతోంది. మరో కో కన్వీనర్ సౌరవ్ దాస్ తాను కూడా అస్సాం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే డెంగ్యూ సోకడంతో వెళ్లడం లేదని ప్రకటించారు. సోమవారం అస్సాం పోలీసులు దీప్కేను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.