Site icon NTV Telugu

Supreme Court: వక్ఫ్ సవరణ చట్టానికి అత్యవసర విచారణ అవసరం లేదు..

Sc

Sc

Supreme Court: వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకురావడాన్ని వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్ ను జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. కాగా, ఈ పిటిషన్లను అత్యవసరంగా లిస్ట్ చేయాలని కపిల్ సిబల్ ధర్మాసనాన్ని కోరారు. వక్ఫ్ సవరణ చట్టం 2025ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణను సుప్రీంకోర్టు ఈ రోజు (ఏప్రిల్ 7న) తిరస్కరించింది.

Read Also: Ashwin Babu : వచ్చిన వాడు అశ్విన్ బాబు.. ఫస్ట్ లుక్ రిలీజ్

అయితే, అత్యవసర విషయాలను మధ్యాహ్నం తన ముందుకు వస్తుంది అని భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తదనుగుణంగా వాటిని జాబితా చేయడంపై న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని నోటిఫై చేసినప్పటి నుంచి వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పుకొచ్చారు. మన దగ్గర ఒక వ్యవస్థ ఉంది.. దానికి అనుకూలంగా ముందుకు వెళ్లాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కి సీజేఐ సూచించారు.

Read Also: US-India Tariffs: అమెరికాపై ప్రతీకార సుంకాలపై భారత్ కీలక ప్రకటన

కాగా, ఈ వక్ఫ్ సవరణ చట్టం దేశ రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడితో పాటు పౌరులకు సమాన హక్కులను హరించడమే కాకుండా వారికి పూర్తి మత స్వేచ్ఛను అందించడంలో అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉందని జమియత్ ఉలామా-ఇ-హింద్ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ బిల్లు ముస్లింల మత స్వేచ్ఛను హరించడానికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వెల్లడించారు. దాంతో మేము వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలు చేశామన్నారు. అలాగే, ఈ చట్టంపై పలు రాష్ట్రాల హైకోర్టుల్లో కూడా జమియత్ ఉలామా-ఇ-హింద్ రాష్ట్ర విభాగాలు పిటిషన్లు దాఖలు చేశాయి.

Exit mobile version