Site icon NTV Telugu

CJI NV Ramana: నేడు సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ

Justice Nv Ramana

Justice Nv Ramana

CJI NV Ramana retires today: భారత ప్రధాన న్యాయమూర్తి( సీజేఐ)గా ఎన్వీ రమణ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్ 24, 2021లో బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 26, 2022న పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ లలిత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా చివరి రోజు పలు హై ప్రొఫైల్ కేసులును విచారించారు. గురువారం రోజు పెగాసస్ స్పైవేర్ కేసుతో పాటు, ఇటీవల బిల్కిస్ బానో కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మందిని విడుదల చేసిన కేసుతో పాటు తీస్తా సెతల్వాడ్ కేసు, ప్రధానమంత్రి సెక్యురిటీ వైఫల్యం వంటి కేసులు విచారించారు.

ఎన్వీ రమణ పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా గురువారం ఢిల్లీ బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పదవీ కాలలో 224 మంది న్యాయమూర్తులను పలు హైకోర్టుల్లో నియమించానని ఆయన వెల్లడించారు. న్యాయమూర్తుల నియామకం, మౌళిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసినట్లు వెల్లడించారు. 2013-14 సమయంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రోజుల్ని ఎన్వీ రమణ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సుప్రీం కోొర్టులో న్యాయమూర్తులుగా ఉన్న కౌల్, ఇందిరా బెనర్జీ, సంజీవ్ ఖన్నా, ఎస్ రవీంద్ర భట్, హిమా కోహ్లీలు కూడా గతంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేయడం విశేషం. వీరంతా కూడా ఎన్వీ రమణ వీడ్కోలు సమావేశానికి హాజరయ్యారు.

Read Also: MLA Rekha Nayak Controversy: ఎమ్మెల్యే రేఖానాయక్ హాట్ కామెంట్స్..ఆడియో వైరల్

ఢిల్లీ హైకోర్టును ఇతర హైకోర్టుతో పోల్చలేమని.. ఇక్కడ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన అనుభవం సుప్రీంకోర్టు సీజేఐ బాధ్యతలు చేపట్టడానికి ప్రారంభం వంటిదని ఆయన అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జీలు తమ ఛాంబర్లలో రాత్రి 7-8 గంటల వరకు కూడా పనిచేసేవారని.. కొన్ని సార్లు 9 గంటల వరకు కూడా ఇక్కడే ఉండటాన్ని చూశానని ఆయన గుర్తు చేసుకున్నారు. సాధారణంగా సాయంత్రం 4 గంటల వరకు కోర్టుల్లో ఉంటారు.. అయితే ఢిల్లీలో పనితీరు చూసి ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు.

Exit mobile version