చిరాగ్ పాశ్వాన్‌కు షాక్.. అధ్యక్ష పదవి నుంచి తొలగింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారిపోయాయి… గత అసెంబ్లీ ఎన్నికల్లో హడావిడి చేసిన యువ నేత చిరాగ్ పాశ్వాన్‌కు గట్టి షాక్ తగిలింది.. లోక్ జనశక్తి పార్టీలో తిరుగుబాటు రావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.. చిరాగ్ పాశ్వాన్ బాబాయ్, ఎంపీ పశుపతి పరాస్ నేతృత్వంలో ఎల్జేపీలో తిరుగుబాటు చేశారు.. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు… లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకున్నట్లు ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలసి తెలియజేయగా.. పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.. ఇక, ఇవాళ అత్యవసరంగా భేటీ అయిన పరాస్ టీమ్.. లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి చిరాగ్ పాశ్వాన్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.. ఇకపై.. ఎల్జేపీ పార్లమెంటరీ నేతగా, పార్లమెంటరీ బోర్డు చైర్మన్‌గా, జాతీయాధ్యక్షుడిగా కూడా పరాస్ ఉంటారని స్పష్టం చేసింది.. మరోవైపు ఈ పరిణామాల తర్వాత పార్టీ సభ్యులతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు చిరాగ్… అధిష్టానం ఆదేశాలు బేఖాతరు చేసిన ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలతో బీహార్ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయాయి.
Also Read
- RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
- Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
- Ebola outbreak: ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
తాజావార్తలు
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!