Site icon NTV Telugu

Pakistan: పాకిస్తాన్‌ ఆర్మీకి శాటిలైట్స్ సపోర్ట్.. జిత్తులమారి చైనా మరో కుట్ర..

China Pakistan

China Pakistan

Pakistan: పాకిస్తాన్ చిరకాల మిత్రులు చైనా మరోసారి భారత్‌కి వ్యతిరేకంగా కుట్రలకు తెర తీసింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్ సపోర్ట్ అందించేందు డ్రాగన్ కంట్రీ ముందుకు వచ్చింది. దీనిపై ఇరు దేశాల మధ్య గత వారం చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. చైనా తన బీడౌ ఉపగ్రహ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం యాక్సెస్ చేయడానికి మే 16న చైనా, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.

Read Also: Robinhood: 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకెళ్తున్న ‘రాబిన్ హుడ్’

పాకిస్తాన్ లోని రావల్పిండి, లాహోర్, సియాల్ కోట్‌తో సహా 11 వైమానిక స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితమైన దాడులు నిర్వహించిన తర్వాత, ఇరు దేశాల మద్య ఈ సమావేశం జరిగింది. పాకిస్తాన్ కి శాటిలైట్ కవరేజ్ పెంచడం, పాకిస్తాన్ సైన్యానికి మద్దతు ఇవ్వడం, భారత కార్యకలాపాల గురించి వారికి తెలియజేయడమే లక్ష్యంగా చైనా ఈ సాయాన్ని అందిస్తోంది. రియల్ టైమ్ కో-ఆర్డినేషన్, నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి 5G కమ్యూనికేషన్ వ్యవస్థల ఏకీకరణపై కూడా రెండు దేశాలు దృష్టి సారించాయి.

ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పాకిస్తాన్ తన శాటిలైట్ సేవల్ని పాకిస్తాన్ సైన్యానికి అందించినట్లు తెలుస్తోంది. ఈ సాయం అందినప్పటికీ భారత్ దెబ్బకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావాల్సి వచ్చింది. పాకిస్తాన్ సైన్యం ఉపయోగించే చైనా నిర్మిత జెట్‌లు, క్షిపణి వ్యవస్థలను‌ భారత స్వదేశీ ఆయుధాలు ఉపయోగించి ధ్వంసం చేసింది. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దళాల కదలికల్ని, కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత్ ఏకంగా 10 శాటిలైట్స్‌ని మోహరించింది. దీంతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది.

Exit mobile version