Site icon NTV Telugu

Indo-China: డ్రాగన్ కవ్వింపులు.. వివాదాస్పద సరిహద్దుపై పాక్‌తో ఒప్పందం.. భారత్ మండిపాటు

India

India

డ్రాగన్ దేశం మరోసారి భారతదేశంతో కయ్యానికి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయన్న తరుణంలో మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. షక్స్‌గామ్ వ్యాలీ సరిహద్దు వివాదంతో భారత దేశాన్ని రెచ్చగొడుతోంది. చైనా చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

జమ్మూ కాశ్మీర్‌లోని షాక్స్‌గామ్ లోయ ఉంది. ఇది భారతదేశ భూభాగం. ఇది ఎన్నో ఏళ్ల నుంచి వివాదాస్పదంగా ఉంది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ సరిహద్దులో ఉన్న ఒక సున్నితమైన ప్రదేశం. ఎత్తైన ఎత్తులో షాక్స్‌గామ్‌ లోయగా ఉంది. వివాదాస్పద సియాచిన్/అక్సాయ్ చిన్ ప్రాంతానికి దగ్గరగా ఉంది. అయితే ఈ లోయ పూర్తిగా ప్రస్తుతం భారత భూభాగంలోనే ఉంది.

తాజాగా పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి షాక్స్‌గామ్ లోయలో 5,180 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు చట్టవిరుద్ధంగా దాయాది దేశం అప్పగించింది. రెండు దేశాలు కూడా సరిహద్దు ఒప్పందంపై సంతకం చేశాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో తాజాగా పేర్కొన్నారు. ఈ పరిణామంపై భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ భూభాగంపై భారతదేశానికి మాత్రమే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఈ చర్య చట్టవిరుద్ధమని ఖండించింది.

బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో భారతదేశం లేవనెత్తిన అభ్యంతరాలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఆ భూభాగం.. చైనా భూభాగంలో భాగంగా ఉందని.. చైనా తన సొంత భూభాగంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోందని తెలిపింది. ఇస్లామాబాద్‌తో చేసుకున్న ఒప్పందం సరైందిగానే అభిప్రాయపడింది. 1960 నుంచి కూడా రెండు దేశాలు సరిహద్దును నిర్ణయించిందని తెలిపింది. సార్వభౌమ దేశాలుగా పాకిస్థాన్-చైనా హక్కులుగా వ్యాఖ్యానించారు.

భారత్ ఖండన
షక్స్‌గామ్ లోయలో చైనా చేస్తున్న మౌలిక సదుపాయాల పనులను భారతదేశం శుక్రవారం ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘షక్స్‌గామ్ లోయ భారత భూభాగం. 1963లో సంతకం చేయబడిన చైనా-పాకిస్థాన్ ‘సరిహద్దు ఒప్పందం’ అని పిలవబడే దానిని మేము ఎప్పుడూ గుర్తించలేదు. ఆ ఒప్పందం చట్టవిరుద్ధం. ఆ ఒప్పందం చెల్లదని మేము నిరంతరం వాదిస్తున్నాము.’’ అని పేర్కొన్నారు. భారత భూభాగం గుండా వెళ్లే చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్‌ను గుర్తించడం లేదని తెలిపారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని స్పష్టం చేశారు. మా ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే హక్కు మాకు ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

Exit mobile version