ఇండియాపై చైనాకు ఎంతటి కుట్ర ఉన్నదో అందరికి తెలిసిందే. ఆర్ధికంగా ఇండియా ఎదుగుతుండటంతో చైనా ఓర్వలేకపోతున్నది. ఆసియాలో ఆదిపత్యం చెలాయించాలని చూస్తున్న చైనాకు ఇండియా నుంచి గట్టిపోటీ ఎదురుకానుండటంతో కుట్రలు చేస్తున్నది. కరోనా మహమ్మారి తరువాత చైనా అంటే ప్రపంచం మొత్తానికి ఒక విధమైన భావన ఏర్పడింది. చైనా కావాలనే ల్యాబ్ నుంచి కరోనా వైరస్‌ను లీక్ చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా చైనా నుంచి దిగుమతులను తగ్గించడమే కాకుండా ఆ దేశానికి చెందిన యాప్‌లపై కూడా ఇండియా నిషేదం విధించడంతో చైనా మండిపడుతున్నది. ఇకపోతే, ఇప్పుడు చైనా మరో కుట్రకు తెరలేపింది. భారత నావికులతో కూడిని విదేశీ షిప్పులను చైనా దేశంలోకి అనుమతించడం లేదు. తమ జలాల్లోకి ప్రవేశించాలంలే నౌకల్లో భారత దేశానికి చెందిన నావికులు ఉండకూడదని, అలా ఉంటే వాటిని తమ జలాల్లోకి అనుమతివ్వబోమని చెప్పింది. దీంతో యూరప్‌తో పాటు అమెరికాకు చెందిన వాణిజ్యనౌకలు ఇతర దేశాలకు చెందిన నావికులను నియమించుకుంటున్నాయి. అయితే, నౌకల్లో నావికులుగా భారతీయులు రాణిస్తున్నారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భారతీయులు వివిధ దేశాల నౌకల్లో నావికులుగా చేరుతున్నారు. భారతీయుల స్థానంలో చైనా తమ దేశానికి చెందిన నావికులను నియమించేందుకు ఈ విధమైన కుట్రలు చేస్తున్నది.