Chilli Powder Bath: ఓరి దేవుడో.. కారం నీటితో స్నానం..మద్యం, సిగరెట్ల నైవేద్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైన్స్ రాకెట్ లాగా దూసుకుపోతున్నా కూడా జనాల్లో మూఢ నమ్మకాలు మాత్రం తగ్గలేదు.. వింత ఆచారాలు మారడం లేదు.. తాజాగా ఓ ఘటన జరిగింది.. పాలాభికం, రక్తాభిషేకం వినే ఉంటారు.. గొడ్డు కారంతో అభిషేకం ఎక్కడైనా చూశారా.. వామ్మో ఇదేం పిచ్చి అనుకుంటున్నారు కదా.. కానీ మీరు విన్నది అక్షరాల నిజం.కారంతో స్నానం చేస్తూ దేవుడిని పూజించే ఆచారం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం చిల్లీ బాత్ ఒకటి తెరపైకి వచ్చింది. కారంతో నోరు మాత్రమే కాదు.. శరీరం కూడా మంటపుడుతుంది. కానీ,కారం నీళ్లతో స్నానం చేయడమంటే మాటలా? ఇవేవీ లెక్కచేయకుండా తమిళనాడుకు చెందిన ఓ పూజారి ఈ సాహసాన్ని చేసి అందర్నీ అశ్చర్యంలో ముంచెత్తాడు.
వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురి జిల్లాలోని నడపనహళ్లీ గ్రామానికి చెందిన గోవిందం అనే పూజారి కారం నీళ్లతో స్నానం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఏటా ఆది అమావాస్య రోజున గ్రామ దైవం పెరియ కరుప్పసామికి కారం, పాలతో అభిషేకం చేస్తారు. ఈ క్రమంలో భక్తులు.. పూజారికి కారం నీళ్లతో స్నానం చేయిస్తారు. అలా చేస్తే దుష్టశక్తులు తొలగిపోయి అందరికీ మేలు జరుగుతుందని నమ్మకం. ముందుగా పూజారి గోవిందం రెండు కొడవళ్లపై నిలబడి భక్తుల సమస్యలను విన్నాడు.. ఘాటైన కారం అయిన ఆ పూజారీ మాత్రం వెన్నక్కి తగ్గలేదు..
Also Read
ఆ ఘాటుకు అక్కడ వాళ్లంతా కూడా షాక్ అయ్యారు.. ఘాటుకు ఉండలేక పోయారు.. కానీ అతను తగ్గలేదు..108 కేజీల కారం నీళ్లను పూజారిపై కుమ్మరించారు. ఆ నీళ్లు కళ్లలోకి వెళ్తున్నా సరే.. ఆ మంటను భరిస్తూ విజయవంతంగా సాంప్రదాయాన్ని పూర్తిచేశాడు పూజారి. కారం నీళ్లను చల్లిన తర్వాత భక్తులు మళ్లీ ఆయనపై నీళ్లు పోశారు. కారం ఘాటు పోయేంత వరకు స్నానం చేయించారు. ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి వస్తుందట. విచిత్రమేమిటంటే చిల్లీ బాత్ సమయంలో పూజారికి ఎలాంటి మంట పుట్టదట. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే.. పెరియ కురుప్పస్వామికి భక్తులు మద్యం, సిగరెట్లను సైతం కానుకగా సమర్పిస్తారు.. ఇలా ఎన్నో వింత ఆచారాలు ఇక్కడ ఉన్నాయి.. ఏంటో ఈ జనాలు దేవుడు పేరుతో ప్రాణాన్ని రిస్క్ లో పడేస్తున్నారు..
#WATCH | Tamil Nadu | Thousands of devotees performed Pitru Karma Puja on Aadi Amavasai, in Rameswaram.
Devotees came here early morning, took a holy dip at Agni Teertham before performing the rituals of the puja. pic.twitter.com/n754Gkz48q
— ANI (@ANI) August 16, 2023
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!