Chhattisgarh: ఛత్తీస్గఢ్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. బీజేపీ నేతను మావోయిస్టులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రతన్ దూబ బీజేపీ నారాయణపూర్ జిల్లా విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. శనివారం రోజు జిల్లాలోని కౌశల్నార్ ప్రాంతంలో రతన్ దూబేను మావోయిస్టులు చంపేవారు. ఆయన జిల్లా పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ హత్యపై దర్యాప్తు చేసేందుకు సంఘటన స్థలానికి ఒక టీంని పంపినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. నవంబర్ 7, 17 తేదీల్లో ఛత్తీస్గఢ్ లో రెండు విడుతలుగా ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 7న ఎన్నికల్లో ఎన్నికలు జరిగే 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారాయణపూర్ కూడా ఉంది. మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్రం కావడంతో ఈ రాష్ట్రంలో రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ సారి మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉన్న అటవీ గ్రామాల్లోని ప్రజలు ఓటేసేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ సారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.