Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాబా ముసుగులో పెద్ద ఎత్తున్న హిందూ అమ్మాయిలను మతం మార్చే నెట్వర్క్ ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కనుగొన్నారు. నేపాల్ సరిహద్దుల్లోని బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్‌ని కేంద్రంగా చేసుకుని ‘‘అక్రమ మతమార్పిడి’’ మాఫియాను నడిపిస్తున్నాడు. లవ్‌జీహాద్‌తో హిందూ మహిళలను వలలో వేసుకునేందుకు ముస్లిం యువకులకు లక్షల్లో డబ్బు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా ఈ నిధులు మిడిల్ ఈస్ట్‌లోని ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చాయి.
ఇదిలా ఉంటే, ఛంగూర్ బాబా తనకు ‘‘ఆర్ఎస్ఎస్’’ సంస్థతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ తిరిగే వాడిని తెలిసింది. అధికారులను కలిసేటప్పుడు తాను ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సీనియర్ కార్యకర్త అని చెప్పుకునేవాడు. ఛంగూర్ బాబా సంస్థ లెటర్ హెడ్‌పై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఫోటోను కూడా ఉపయోగించుకున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరో కీలక నిందితుడు ఈదుల్ ఇస్లాం నిర్వహిస్తున్న భారత్ ప్రతికార్త్ సేవా సంఘ్ అనే సంస్థకు ఛంగూర్ బాబాను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ సంస్థ పేరును వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్లు అధికారులు గుర్తించారు.
అధికారులు, రాజకీయ నాయకులతో సమావేశాల సమయంలో ఛంగూర్ బాబా, తనను నమ్మేలా ప్రముఖ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పేర్లను వాడే వాడని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ATS) అతను విదేశీ నిధుల సహాయంతో ఉగ్రవాద శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కుట్ర పన్నుతున్నాడని తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్‌తో సహా విదేశీ వనరుల నుండి అతను రూ. 500 కోట్లకు పైగా అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును ఈడీ కూడా విచారిస్తోంది. ఇదే కాకుండా, ఛంగూర్ బాబా, అతడి సహచరులు ముడిపడి ఉన్న 22 బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే రూ.60 కోట్ల విలువైన మనీలాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.