Site icon NTV Telugu

Tamil Nadu: ‘‘బురఖా మీ అందమైన ముఖాన్ని దాచిపెడుతోంది’’.. పోలీస్ అధికారి సస్పెండ్..

Burakha

Burakha

Tamil Nadu: ముస్లిం మహిళను ఉద్దేశించి ఓ కానిస్టేబుల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మహిళ ధరించిన బురఖాను ఉద్దేశించి అనుచిత వ్యాక్యలు చేశాడు. దీంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఫిబ్రవరి 22, గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. పోలీస్ వివక్షాపూరిత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌లు వెళ్లువెత్తాయి.

Read Also: Actor Arrest: పెళ్లి చేసుకుంటానని 13 ఏళ్లుగా అత్యాచారం.. ప్రముఖ నటుడి అరెస్ట్..

వివరాల ప్రకారం.. దొంగిలించబడిని తన వాహనం పరిస్థితిని తెలుసుకునేందుకు ఓ మహిళ ఒట్టేరి పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. అక్కడ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెల్‌మురుగన్ ఆమె పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ అందమైన ముఖాన్ని దాచిపెడుతున్న మీ బురఖాను తీసేయాలి’’ అని కోరాడు. ఫాతిమాగా గుర్తించబడిన బాధితురాలు ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. విచారణ అనంతరం వేల్‌మురుగన్‌ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.

ఫిబ్రవరి 14న అదృశ్యమైన తన వాహనం కోసం ఫాతిమా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె టూవీలర్ మిస్సింగ్‌పై కేసు నమోదైంది. పుదుపేటలో ఈ వాహనం కనిపించడంతో రెండు రోజుల తర్వాత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోర్టు నుంచి దొరికిన స్కూటర్‌ని తీసుకోవాలని కానిస్టేబుల్ వేల్‌మురుగన్ ఫాతిమాకు చెప్పిన తర్వాత, ఆమె దానిని తీసుకునేందుకు వెళ్లింది. అదే పనిగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకోవడం ఫాతిమాను బాధపెట్టింది. ఆమె ఏడుస్తున్న సమయంలో కూడా అందంగా ఉందని, మీ అందమైన ముఖాన్ని బురఖా కింద దాచిపెట్టకుండా తీసేయాలని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఉన్నతాధికారులు అతడిపై యాక్షన్ తీసుకున్నారు.

Exit mobile version