Tamil Nadu: ముస్లిం మహిళను ఉద్దేశించి ఓ కానిస్టేబుల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మహిళ ధరించిన బురఖాను ఉద్దేశించి అనుచిత వ్యాక్యలు చేశాడు. దీంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఫిబ్రవరి 22, గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. పోలీస్ వివక్షాపూరిత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌లు వెళ్లువెత్తాయి.