దేశంలోని పలు మెట్రో నగరాల్లో ప్రయాణికుల పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే కొన్ని సందర్భాల్లో మెట్రో రైళ్లలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా చెన్నైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
చెన్నైలోని బ్లూ లైన్లో ఒక మెట్రో రైలు అకస్మాత్తుగా సబ్వే క్రింద ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు. రైలు దాదాపు 10 నిమిషాల పాటు కదలకుండా ఉండిపోయింది. దీంతో ప్రయాణికులు భయపడిపోయారు. తర్వాత సమస్య పరిష్కారం కావడంతో రైలు తిరిగి యథావిధిగా ప్రయాణం కొనసాగింది.
అయితే.. విమ్కో నగర్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ దిశగా సాగుతున్న రైలు, సెంట్రల్ మెట్రో – హైకోర్టు స్టేషన్ల మధ్యలో నిలిచిపోయింది. రైలు కదలకపోవడంతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులు ట్రైన్ డోర్లు తెరచి నేరుగా పట్టాలపైకి దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కొందరు ప్రయాణికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.
మెట్రోలో ప్రతిసారి ఏదో ఒక సమస్య తలెత్తుతోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇలాంటి లోపాలు చోటుచేసుకోవడం బాధకరమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఘటన తర్వాత ప్రయాణికులకు మెట్రో అధికారులు క్షమాపణలు తెలియజేశారు.
Chennai Metro train breaks down in tunnel; passengers walk through the subway to exit pic.twitter.com/NhqYqqmhj9
— TIMES NOW (@TimesNow) December 2, 2025
Technical glitch hits Chennai Metro!
Train halts midway between Chennai Central & High Court stations.
Power cut in the coach, passengers walked through tunnel to nearest station. 🚶♂️
தொழில் நுட்ப கோளாறால் நடுவழியில் நின்ற சென்னை மெட்ரோ#Chennai #METRORail #ChennaiMetro pic.twitter.com/xYxsauOLnk
— Unmai Kasakkum (@Unmai_Kasakkum) December 2, 2025