Charu Pandey: కోచింగ్ లేదు.. బుక్స్ పట్టుకుని కూర్చోలేదు! కానీ 19 గవర్నమెంట్ జాబ్స్ కొట్టింది.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు!
- కోచింగ్ లేకుండానే 19 ప్రభుత్వ ఉద్యోగాలు..
- రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోనున్న ఛత్తీస్‌గఢ్ యువతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charu Pandey: ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 19 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి సంచలనం సృష్టించింది ఓ 23 ఏళ్ల యువతి. ఛత్తీస్‌గఢ్‌లోని టిల్డా-నియోరాకు చెందిన చారు పాండే అనే యువతి సాధించిన ఈ అరుదైన ఘనత ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని కాగ్ (CAG) ఆఫీసులో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా తన ‘డ్రీమ్ జాబ్’ చేస్తోంది. అంతేకాదు ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చారు పాండే బంగారు పతకాన్ని అందుకోనుంది.
ఒకదాని తర్వాత ఒకటి.. వరుసగా 19 ఉద్యోగాలు
గణితంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చారు.. కాలేజీ రోజుల్లోనే పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఎక్కడా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా, కేవలం సెల్ఫ్ స్టడీపైనే ఆధారపడి పరీక్షలు రాసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎన్నో ప్రతిష్టాత్మక పరీక్షలను ఆమె అవలీలగా క్లియర్ చేసింది.
Also Read
- PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
- Maharashtra: టీమ్‌లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
- PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
ఆమె సాధించిన ఉద్యోగాల లిస్ట్ ఇదే..
* SSC రిక్రూట్మెంట్స్: SSC CGL, CHSL, MTS, GD, CPO.
* బ్యాంకింగ్ రంగం: SBI PO, SBI క్లర్క్, IBPS PO, IBPS క్లర్క్.
* ఇతర రంగాలు: రైల్వేస్, పోలీస్ డిపార్ట్మెంట్, పలు స్టేట్ లెవెల్ ఉద్యోగాలు.
రోజుకు 20 గంటల కఠిన సాధన..
ఈ సందర్భంగా చారు మాట్లాడుతూ.. “నిజానికి నేను ఇన్ని ఉద్యోగాలు సాధించాలని ముందే ప్లాన్ చేసుకోలేదు. ఒక ఎగ్జామ్ రాశాక, దాని రిజల్ట్స్ రావడానికి చాలా టైమ్ పట్టేది. ఆ గ్యాప్‌లో ఖాళీగా కూర్చోకుండా మరో నోటిఫికేషన్‌కు ప్రిపేర్ అయ్యేదాన్ని. అలా ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు వస్తూనే ఉన్నాయి” అని చారు తన జర్నీని పంచుకుంది. ప్రిపరేషన్‌పై పూర్తి ఫోకస్ పెట్టడం కోసం చారు రాయ్‌పూర్‌లోని ఒక గెస్ట్ హౌస్‌లో ఆరు నెలల పాటు ఒంటరిగా గడిపింది. బాహ్య ప్రపంచానికి, సోషల్ మీడియా ఆకర్షణలకు దూరంగా ఉంటూ.. ఆ సమయంలో రోజుకు దాదాపు 20 గంటల పాటు చదివేదాన్ని అని ఆమె వెల్లడించారు. అదే సమయంలో తన సబ్జెక్ట్ నాలెడ్జ్ మరింత పెంచుకోవడానికి స్కూల్ పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పేదని వెల్లడించారు. “సిలబస్ మొత్తం పూర్తి చేయాలనే ఆరాటంతో చదవకూడదు. మనం ఎంత చదివాం, ఏ సబ్జెక్ట్ చదివాం అనేదాని కంటే.. చదివినంత వరకు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనేదే ముఖ్యం” అని చారు సక్సెస్ మంత్రను వివరించింది.
యూట్యూబ్, ‘AI’ సాయంతో ప్రిపరేషన్!
కోచింగ్ సెంటర్లకు వేలకు వేలు ఫీజులు కట్టకుండా కేవలం ఆన్లైన్ అవకాశాలనే చారు ఆయుధాలుగా మార్చుకుంది. యూట్యూబ్‌లో వివిధ సబ్జెక్ట్ నిపుణుల లెక్చర్స్ వినేదాన్ని అని, చదివేటప్పుడు ఎలాంటి డౌట్స్ వచ్చినా వాటిని నివృత్తి చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ సహాయం తీసుకునేదాన్ని అని ఆమె వెల్లడించింది. సమయ పాలన, సానుకూల దృక్పథం, ఒత్తిడి ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడటం వంటివి అభ్యర్థులకు ఎంతో అవసరమని ఈ చారు సూచిస్తోంది. కాగా, తన కూతురు సాధించిన ఈ అద్భుత విజయాలపై ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ.. “మా అమ్మాయి ఎప్పుడూ పుస్తకాలతోనే కూర్చుని మాకు కనిపించలేదు, కానీ ఆమె కష్టాన్ని, టాలెంట్‌ను మేము ఎప్పుడూ నమ్మాం” అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
Suriya 48 : ఎగ్మోర్‌లో జెట్ స్పీడ్‌లో సూర్య- టి.జె. జ్ఞానవేల్ షూటింగ్
-
Jyoti Venkatesh: అవును, రామ్‌గోపాల్ వర్మ, ఊర్మిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు..
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్‌పై కేసు నమోదు..
ట్రెండింగ్
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్‌తో ASUS Pad (T3201) భారత్‌లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!