Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Chandrayaan 3 Is Just A Step Away From Jabilli Into The Final Orbit

Chandrayaan-3: జాబిల్లికి అడుగు దూరంలో.. చివరి కక్ష్యలోకి చంద్రయాన్‌-3

Published Date :August 16, 2023 , 1:00 pm
By Naga Maneendra
Chandrayaan-3: జాబిల్లికి అడుగు దూరంలో.. చివరి కక్ష్యలోకి చంద్రయాన్‌-3
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chandrayaan-3: చంద్రుడికి అతి దగ్గరలోకి చంద్రయాన్‌-3 చేరుకుంది. చంద్రుడికి కొద్ది దూరంలోనే ఉంది.. మరికొద్ది రోజుల్లో ఇది సక్సెస్‌ కానున్నట్టు ఇస్రో ప్రకటించింది. చంద్రుడి చుట్టు వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఇస్రో (ISRO) విజయవంతంగా నిర్వహించింది. చంద్రుడి ఉపరితలంపై దిగే చారిత్రాత్మక ఘట్టానికి మరింత చేరువైంది. బుధవారం జాబిల్లి చివరి కక్ష్యలోకి చంద్రయాన్‌-3 ప్రవేశించింది. చంద్రయాన్‌-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని నేడు మరోసారి విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో (ISRO) ప్రకటించింది. నేటి విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలు పూర్తయ్యాయి. జాబిల్లి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష్య కాగా.. తాజా విన్యాసంతో వ్యోమనౌక కక్ష్యను 153 km x 163 kmలకు తగ్గించినట్లు ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్‌-3 ఇప్పుడు చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరిందని శాస్ర్తవేత్తలు ప్రకటించారు.

Read also: Gannavaram Politics: యార్లగడ్డను లైట్ తీసుకున్న వైసీపీ..! నెక్ట్స్ ఏంటి..?

చంద్రయాన్‌-3కి సంబంధించి ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన దశలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయని.. ఆగస్టు 17న వ్యోమనౌకలోకి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోయే ప్రక్రియను చేపడతారని సైంటిస్టులు చెబుతున్నారు. అది కూడా సజావుగా సాగితే ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోయి చంద్రయాన్‌-3 సొంతంగా జాబిల్లిని చుట్టేస్తుంది. ఇదంతా కరెక్టుగా జరిగితే నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో (ISRO) వెల్లడించింది. ‘చంద్రయాన్‌-3’ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ‘ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య’లోకి ప్రవేశపెట్టారు. అక్కడినుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు ఇస్రో శాస్ర్తవేత్తలు. ఈ నేపథ్యంలో అన్ని పూర్తయితే ఈ నెల 23న చంద్రయాన్‌-3 విజయవంతంగా చంద్రుడిపై అడుగు పెడుతుందని శాస్ర్తవేత్తలు స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandrayaan 3
  • Final Orbit
  • From Jabilli
  • ISRO
  • Step Away

తాజావార్తలు

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

  • UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్

  • CM Revanth Reddy: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

  • Anil Ravipudi: వెంకీ – అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఫిక్స్!

  • Iran US conflict: ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. నెతన్యాహు అడుగుజాడలను అనుసరిస్తే కాల్చి బూడిద చేస్తాం

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions