Emmanuel Macron: యూపీఐతో చాయ్ డబ్బులు, ఆశ్చర్యంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emmanuel Macron: భారత గణతంత్ర వేడుకులకు ఈ ఏడాది ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ వచ్చారు. ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు సాగిన ఆయన పర్యటన జైపూర్ నగర సందర్శనతో మొదలైంది. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా రక్షణ, టెక్నాలజీ రంగాల్లో ఒప్పందాలు చోటు చేసుకున్నాయి.
Read Also: Animal: ‘యానిమల్’లో నాన్న అనే పదం ఎన్ని వందల సార్లు ఉపయోగించారో తెలుసా?
Also Read
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
ఇదిలా ఉంటే తొలి రోజు జైపూర్ సందర్శనలో హవా మహల్ దగ్గర ప్రధాని మోడీ, అధ్యక్షుడు మక్రాన్ కలిసి ‘ఛాయ్’ తాగారు. ఆ తర్వాత మక్రాన్ ‘యూపీఐ’ సిస్టమ్ ద్వారా మొబైల్‌తో డబ్బులు చెల్లించారు. డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) చెల్లింపులు చేస్తున్న సమయంలో ఆశ్చర్యపోవడం మక్రాన్ వంతైంది. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ కోసం అధికారిక విందును ఏర్పాటు చేశారు. అధికార విందులో టీకి బదులుగా ‘చాయ్’ అంటూ, మోడీతో కలిసి చాయ్ తాగడాన్ని మరిచిపోలేనని మక్రాన్ అన్నారు.
‘‘ మేము హవా మహల్ సమీపంలో కలిసి చాయ్ తాగడాన్ని మరిచిపోలేను, ఇది యూపీఐతో చాయ్ డబ్బులు చెల్లించాం. ఇరు దేశాలు కలిసి పనిచేయాలుకుంటున్నాయి.’’ అని మక్రాన్ అన్నారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సమయంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. గత ఏడాది జూలైలో ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారతీయ ప్రయాణికులు త్వరలోనే ఫ్రాన్స్‌లో యూపీఐని ఉపయోగించి చెల్లింపులు చేయగలరని చెప్పారు. యూపీఐని వినియోగించేందుకు ఫ్రాన్స్, ఇండియా అంగీకరించాయి.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?