NTV Telugu Site icon

Emmanuel Macron: యూపీఐతో చాయ్ డబ్బులు, ఆశ్చర్యంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు..

Modi, Macron

Modi, Macron

Emmanuel Macron: భారత గణతంత్ర వేడుకులకు ఈ ఏడాది ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ వచ్చారు. ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు సాగిన ఆయన పర్యటన జైపూర్ నగర సందర్శనతో మొదలైంది. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా రక్షణ, టెక్నాలజీ రంగాల్లో ఒప్పందాలు చోటు చేసుకున్నాయి.

Read Also: Animal: ‘యానిమల్’లో నాన్న అనే పదం ఎన్ని వందల సార్లు ఉపయోగించారో తెలుసా?

ఇదిలా ఉంటే తొలి రోజు జైపూర్ సందర్శనలో హవా మహల్ దగ్గర ప్రధాని మోడీ, అధ్యక్షుడు మక్రాన్ కలిసి ‘ఛాయ్’ తాగారు. ఆ తర్వాత మక్రాన్ ‘యూపీఐ’ సిస్టమ్ ద్వారా మొబైల్‌తో డబ్బులు చెల్లించారు. డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులు చేస్తున్న సమయంలో ఆశ్చర్యపోవడం మక్రాన్ వంతైంది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ కోసం అధికారిక విందును ఏర్పాటు చేశారు. అధికార విందులో టీకి బదులుగా ‘చాయ్’ అంటూ, మోడీతో కలిసి చాయ్ తాగడాన్ని మరిచిపోలేనని మక్రాన్ అన్నారు.

‘‘ మేము హవా మహల్ సమీపంలో కలిసి చాయ్ తాగడాన్ని మరిచిపోలేను, ఇది యూపీఐతో చాయ్ డబ్బులు చెల్లించాం. ఇరు దేశాలు కలిసి పనిచేయాలుకుంటున్నాయి.’’ అని మక్రాన్ అన్నారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సమయంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. గత ఏడాది జూలైలో ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారతీయ ప్రయాణికులు త్వరలోనే ఫ్రాన్స్‌లో యూపీఐని ఉపయోగించి చెల్లింపులు చేయగలరని చెప్పారు. యూపీఐని వినియోగించేందుకు ఫ్రాన్స్, ఇండియా అంగీకరించాయి.