Central Government: జూలై 1 నుంచి కొత్త లేబర్ లా..పెరగనున్న వీక్లీ ఆఫ్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయాలని యోచిస్తోంది. కొత్త లేబర్ చట్టాల ప్రకారం ఉద్యోగుల జీతం, ప్రావిడెంట్ ఫండ్, వీక్లీ ఆఫ్స్ ఇలా అన్నింటిపై ప్రభావం పడనుంది. కొత్త లేబర్ చట్టాల ప్రకారం.. రోజూవారీ పని గంటలు పెరగడంతో పాటు ఉద్యోగుల హోం టేకింగ్ సాలరీ తగ్గి, పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరగనుంది.
ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాలు, కేంద్ర తీసుకువచ్చిన నాలుగు కార్మిక చట్టాల కింద నిబంధనలను రూపొందించ లేదు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ముసాయిదా నిబంధనలు ప్రచురించాయని కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. కొత్త కార్మిక చట్టాల ప్రకారం కంపెనీలు పని గంటలను 8-9 గంటల నుంచి 12 గంటల వరకు పెంచవచ్చు.. అయితే ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లను అందించాలి. కొత్త చట్టాల ప్రకారం మొత్తం పనిగంటల్లో తేడాలు ఏమీ ఉండవు. వారానికి మొత్తం 48 పనిగంటలు పనిచేయాల్సి ఉంటుంది.
Also Read
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
- CJP: 'క్యా బోల్తీ పబ్లిక్'.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ఇక వేతనం విషయానికి వస్తే గ్రాస్ సాలరీలో కనీసం 50 శాతం బేసిక్ సాలరీ ఉండనుంది. దీని వల్ల ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పెరగనుంది. దీని వల్ల ప్రైవేటు రంగంలో ఉద్యోగుల జీతాలు గణనీయంగా ప్రభావితం కానున్నాయి. కొత్త కార్మిక చట్టాల ప్రకారం పదవీ విరమణ కార్పస్, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను ఉపసంహరించుకుని కొత్తగా 4 కార్మిక చట్టాలను తీసుకువచ్చింది. అయితే కార్మిక అంశం అనేది కేంద్ర, రాష్ట్ర జాబితాల్లోని ఉమ్మడి అంశం కావడంతో రాష్ట్రాలు కూడా కొత్త కోడ్ కింద నియమ, నిబంధనలను తెలియజేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
-
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!