మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆమెపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. ఆమె సర్వీస్‌ను నిలిపివేయడంతో పాటు భవిష్యత్‌లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా నిషేధించింది. తాజాగా కేంద్రం కూడా ఆమెపై యాక్షన్ తీసుకుంది. ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Digital Arrest: “డిజిటల్ అరెస్ట్‌ల” పేరుతో కొత్త స్కామ్‌లు.. డబ్బులు వసూలు చేసేవరకు బాత్రూం కూడా పోనివ్వరు!
కేంద్ర ప్రభుత్వం పూజా ఖేద్కర్‌ను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) నుంచి తక్షణమే డిశ్చార్జ్ చేసినట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెలువడ్డాయి. IAS (ప్రొబేషన్) రూల్స్, 1954లోని రూల్ 12 ప్రకారం పూజా ఖేద్కర్‌ను డిశ్చార్జ్ చేస్తూ తక్షణమే అమలులోకి తెచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రొబేషనర్ సర్వీస్‌లో రిక్రూట్‌మెంట్‌కు అనర్హుడని కేంద్ర ప్రభుత్వం భావిస్తే లేదా ప్రొబేషనర్లను సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేసే హక్కును కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Digital Arrest: “డిజిటల్ అరెస్ట్‌ల” పేరుతో కొత్త స్కామ్‌లు.. డబ్బులు వసూలు చేసేవరకు బాత్రూం కూడా పోనివ్వరు!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) జూలై 31 న ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో జరిగే పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేసింది. రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడానికి UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022లో ఆమె చేసిన దరఖాస్తులో సమాచారాన్ని తప్పుగా సూచించారని ఆరోపించింది. ఇతర వెనుకబడిన తరగతులు (OBC) మరియు వికలాంగుల కోటా ప్రయోజనాలను మోసం చేసి తప్పుగా పొందినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె యూపీఎస్సీ చర్య తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. ఇక ఆమె అక్రమాలపై ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆమె సమర్పించిన వైకల్యం సర్టిఫికెట్ నకిలీదేనని పోలీసులు తేల్చారు. కోర్టుకు సమర్పించారు. తాజాగా కేంద్రం కూడా ఆమెను సర్వీసు నుంచి తప్పించింది. మొత్తానికి పూజా ఖేద్కర్.. ఐఏఎస్ ఉన్నతమైన ఉద్యోగాన్ని కోల్పోవల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Sobhita: ఖరీదైన ఎంగేజ్‌మెంట్ డైమండ్ రింగ్‌తో శోబిత ఫోటోలు.. చైతన్య రియాక్షన్ చూశారా