Site icon NTV Telugu

E-Commerce: అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌పై కేంద్రం చర్యలు.. కారణం ఏంటంటే..

E Commerce

E Commerce

E-Commerce: నిబంధనలకు అనుగుణంగా లేని ప్రొడక్ట్ పంపిణీని అరికట్టడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) చర్యలకు ఉపక్రమించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ గిడ్డంపులపై దాడులు నిర్వహించింది. లక్నో, గురుగ్రామ్, ఢిల్లీ వంటి నగరాల్లోని ఆయా సంస్థల వేర్‌హౌజులపై దాడులు నిర్వహించింది.

మార్చి 7న లక్నోలోని అమెజాన్ గిడ్డంగిలో ఇటీవల నిర్వహించిన సోదాల్లో, అధికారులు 215 బొమ్మలు, 24 హ్యాండ్ బ్లెండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటికి BIS లేదని గుర్తించారు. ఫిబ్రవరిలో, గురుగ్రామ్‌లోని అమెజాన్ గిడ్డంగిలో ఆపరేషన్‌లో 58 అల్యూమినియం ఫాయిల్స్, 34 మెటాలిక్ వాటర్ బాటిళ్లు, 25 బొమ్మలు, 20 హ్యాండ్ బ్లెండర్లు, 7 పివిసి కేబుల్స్, 2 ఫుడ్ మిక్సర్లు, 1 స్పీకర్ స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా నాన్-సర్టిఫైడ్‌గా ఉన్నట్లు తేల్చారు. అదేవిధంగా, గురుగ్రామ్‌లోని ఇన్‌స్టాకార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగిలో నిర్వహించిన సోదాల్లో, బీఐఎస్ అధికారులు 534 స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు (వాక్యూమ్ ఇన్సులేటెడ్), 134 బొమ్మలు, సర్టిఫికేట్ లేని 41 స్పీకర్లను స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Ambati Rambabu: జగన్ కమిడియన్ అయితే.. మరి నువ్వేంటి నాగబాబు?

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ రెండింటిలో ఉల్లంఘనలపై బీఐఎస్ జరిపిన దర్యాప్తులో సర్టిఫైడ్ కానీ ఉత్పత్తులు టెక్విజన్ ఇంటర్నేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందినవిగా తేల్చారు. ఈ సమాచారం ఆధారంగా, బీఐఎస్ ఢిల్లీలోని టెక్విజన్ ఇంటర్నేషనల్‌కి చెందిన రెండు ఫెసిలిటీలపై దాడులు నిర్వహించింది. బీఐఎస్ సర్టిఫికేషన్ లేకుండా సుమారు 7000 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 4000 ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్సర్లు, 95 ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లు, 40 గ్యాస్ స్టవ్‌లను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న నాన్-సర్టిఫైడ్ ప్రోడక్ట్స్‌లో డిజిస్మార్ట్, యాక్టివా, ఇనల్సా, సెల్లో స్విఫ్ట్, బటర్ ఫ్లై బ్రాండ్లు ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మింత్రా, బిగ్‌బాస్కెట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అనేక నాన్-సర్టిఫైడ్ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయని బీఐఎస్ గుర్తించింది.

Exit mobile version