Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Centre Accepts Tamil Nadus Request To Send Aid To Sri Lanka

Sri Lanka Crisis: శ్రీలంకలోని తమిళులకు స్టాలిన్ సర్కార్‌ భారీ సాయం

Published Date :May 3, 2022 , 6:33 pm
By Sudhakar Ravula
Sri Lanka Crisis: శ్రీలంకలోని తమిళులకు స్టాలిన్ సర్కార్‌ భారీ సాయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు నరకం చూస్తున్నారు.. కొనే పరిస్థితి లేదు.. అమ్మడానికి కూడా ఏమీ లేదు అనే తరహాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. ఇప్పటికే శ్రీలంకకు భారత్‌ భారీ సాయం చేయగా.. ఇప్పుడు.. శ్రీలంకలోని తమిళులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తరపున కోటి రూపాయలు విరాళంగా ఇవ్వనున్నారు.. ప్రభుత్వం తరపున మొదటి విడతగా 40 వేల టన్నుల బియ్యం, 500 టన్నుల మిల్క్ పౌడర్, సహా అత్యవసరమైన మందులు పంపిణీ చేయనున్నారు.. మొత్తం, రూ.123 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు, సరుకులను సరఫరా చేసేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. శ్రీలంక తమిళులకు చేయూత నివ్వాలని ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేశారు సీఎం స్టాలిన్.

Read Also: Marriage: 15 ఏళ్లుగా సహజీవనం.. ఒకేసారి ముగ్గురు మహిళలతో పెళ్లి..

కాగా, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో అత్యవసర, నిత్యావసర వస్తువులను కొనలేని పరిస్థితి వచ్చింది.. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో అక్కడి ప్రజలు కనీసం నిత్యావసర సరుకులను కూడా కొనుగోలు చేయడం భారంగా మారింది. పెట్రోలు, డీజిల్, కిరోసిన్‌, గ్యాస్‌, నిత్యావసరాలు ఏవైనా కొనుగోలు చేయాలంటే గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు, విద్యుత్‌ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్‌ లేని కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను కూడా మూసివేయాల్సిన పరిస్థితి.. ఈ క్రమంలో శ్రీలంకకు భారత్‌ సహా మిత్రదేశాలు స్నేహహస్తం అందిస్తూ.. సాయం చేస్తున్న విషయం తెలిసిందే కాగా.. స్టాలిన్ సర్కార్‌ కూడా శ్రీలంకకు అత్యవసర వస్తువులను, ఆహార పదార్థాలు, మందులను అందజేయాలని నిర్ణయించింది. మరోదేశానికి పంపే పనికాబట్టి.. నేరుగా శ్రీలంకకే పంపే అవకాశం లేకపోవడంతో.. కేంద్రం అనుమతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి.. గవర్నర్‌ ద్వారా కేంద్రానికి పంపింది.. మరోవైపు, సీఎం స్టాలిన్‌ కూడా ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇక, కేంద్రం నుంచి అనుమతి రావడంతో.. త్వరలోనే తమిళనాడు సాయం.. శ్రీలంకకు అందనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Centre
  • CM Stalin
  • Sri Lanka
  • Tamil Nadu

తాజావార్తలు

  • Teja sajja : తేజ సజ్జ కొత్త స్టెప్ ఆయన కెరీర్‌కు ప్లస్ అవుతుందా? లేక రిస్క్‌గా మారుతుందా?

  • Tollywood : స్ట్రాంగ్ కంబ్యాక్ ట్రై చేస్తున్న ఒకప్పుడు బాక్సాఫీస్‌ను రూల్ చేసిన ఇద్దరు సీనియర్ హీరోలు

  • MI Captain Change: ‘ముంబై ఇండియన్స్’ కెప్టెన్సీ నుండి ‘హార్దిక్ పాండ్య’ అవుట్..? కొత్త కెప్టెన్ గా..!

  • LPG crisis India: వంటగ్యాస్‌లో కొత్త మార్పు.. ఇకపై, 14.2 కేజీల సిలిండర్‌కు బదులుగా, 10 కేజీల సిలిండర్!

  • IPL Sponsorship Revenue: రూ.1,000 కోట్ల మైలురాయి దాటిన ఐపీఎల్‌ జట్ల స్పాన్సర్‌షిప్ ఆదాయం..! దీని అర్థం ఏంటి…?

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions