ఎల్ఐసీ కీలక నిర్ణయం.. ఆయన పదవీకాలం పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. దీంతో పాటు మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ కుమార్ పదవీకాలాన్ని కూడా ప్రభుత్వం ఏడాది పొడిగించింది. ఈ పొడిగింపుతో ఎం.ఆర్. కుమార్ 2023 మార్చి వరకు ఛైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. త్వరలో ఐపీఓకి వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐపీఓకి వచ్చేందుకు ఎల్‌ఐసీ సిద్దం అవుతోంది.
ఎల్‌ఐసీ వైర్మన్ పదవీకాలాన్ని పొడిగించడం ఇది రెండవసారి. గత ఏడాది జూన్‌లోనూ ఎం.ఆర్.కుమార్‌కు 9 నెలల పొడిగింపునిచ్చారు. సంగతి మనకు తెలిసిందే. ఐపీవోకి సంబంధించిన ప్రక్రియ సాఫీగా సాగాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎల్‌ఐసీ ఐపీఓకి వీలుగా లైఫ్ ఇన్ఫూరెన్స్ కార్పొరేషన్ చట్టానికి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్పులు చేసింది. అవన్నీ గత ఏడాది జూన్ 30 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎల్‌ఐసీ ఐపీఓలో జాబితా చేసిన తర్వాత రూ.8-10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువతో దేశంలో అతిపెద్ద సంస్థగా మారే అవకాశం ఉంది. దేశంలోనే ఎల్ఐసీ అతి పెద్ద బీమా సంస్థ. తమ పాలసీదారుల విషయంలో ఎల్ ఐసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!