Site icon NTV Telugu

Indigo Crisis: విమాన ఛార్జీలపై కేంద్రం కొరడా.. సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటే చర్యల తప్పవని హెచ్చరిక

Indigo Crisis

Indigo Crisis

విమాన ప్రయాణాల్లో 20 ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభం భారత్ ఎదుర్కొంటోంది. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం. మునుపెన్నడూ లేని కష్టాలు ప్రయాణికులు పడుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండానే ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసులు నిలిపేసింది. దీంతో అత్యవసర ప్రయాణాలు ఉన్నవాళ్లంతా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. లోపలికి వెళ్లి పోయిన బ్యాగ్‌లు వెనక్కి రాక.. ఇటు ఇంటికి తిరిగి వెళ్లలేక ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణించలేం. ఐదు రోజులుగా ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు.

ఇంకోవైపు ప్రత్యామ్నాయంగా వేరే ఎయిర్‌లైన్స్‌కు మొగ్గు చూపుతున్న తరుణంలో విమాన ఛార్జీలు చూసి గుండె ఆగినంత పనవుతోంది. ఇండిగోలో తలెత్తిన సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు ఇతర విమాన సంస్థలన్నీ ఒక్కసారిగా ధరలు పెంచేశాయి. ఆస్తులు అమ్ముకునేలా ధరలు పెంచేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా కేంద్ర విమానయాన శాఖ అప్రమత్తం అయింది. అధిక ఛార్జీలతో ప్రయాణికులను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న విమాన సంస్థలపై కొరడా ఝుళిపించింది. ఇండిగో సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చిది. సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఆదేశించింది.

నిర్దేశించిన ఛార్జీల పరిమితులను కచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశించింది. పరిస్థితులు చక్కబడే వరకూ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, రోగులు, అత్యవసరంగా ప్రయాణించే ప్రయాణికులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ఛార్జీలను నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంటామని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితిని క్యాష్ చేసుకోవద్దని విమానయాన శాఖ హెచ్చరించింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.

 

Exit mobile version