Indian Navy: యుద్ధనౌకల ప్రాజెక్ట్ కు కేంద్రం ఆమోదం.. రూ. 20 వేల కోట్లు కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Navy: భారత ప్రభుత్వం రక్షణ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించగా.. ఇప్పుడు యుద్ధ నౌకలను దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించింది. యుద్ధనౌకల తయారీ ప్రాజెక్టకు కేంద్రం ఆమోదం తెలిపింది. భారత నావికాదళానికి ప్రోత్సాహంగా నౌకల్లో ఇంధనం, ఆహారం, మందుగుండు సామగ్రిని నింపడానికి సహాయపడే ఐదు ఫ్లీట్ సపోర్ట్ నౌకలను నిర్మించే ప్రాజెక్టుకు కేంద్రం బుధవారం అనుమతి ఇచ్చింది. ఈ ఐదు నౌకలను రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించే నౌకలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆత్మనిర్భరత లేదా భారత నౌకాదళ స్వావలంబన లక్ష్యాలను పెంచుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. నౌకాదళ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన రూ.20,000 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Read also: Nidhi Agerwal: అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈరోజు అది చూసే వాళ్లం
Also Read
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
భారత నావికాదళ పరాక్రమాన్ని బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనున్నాయి. సముద్రాలలో మోహరించే సమయంలో ఆహారం, ఇంధనం, మందుగుండు సామగ్రితో సహా అవసరమైన సామాగ్రిని అందించడం ద్వారా వివిధ నౌకాదళాలకు సేవలు అందిస్తాయి. ఈ ప్రాజెక్టు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు కూడా గణనీయమైన ప్రయోజనాలను అందించనుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో సహా అనేక భాగస్వాములతో కూడిన సహకార ప్రయత్నాల ద్వారా అమలు చేయబడే ఈ స్మారక ఆర్డర్ ను అందుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. రానున్న 10 ఏళ్లల్లో ఈ ఐదు నౌకలు సిద్ధమవుతాయని రక్షణ రంగం భావిస్తోంది. సుమారు రూ.20 వేల కోట్ల ప్రాజెక్టుకు బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తుది అనుమతి ఇచ్చింది. ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్ లను హెచ్ఎస్ఎల్ అనేక భారతీయ ప్రైవేట్ రంగ చిన్న, మధ్యతరహా సంస్థల మద్దతుతో నిర్మిస్తుందని ప్రభుత్వ రక్షణ వర్గాలు తెలిపినట్టు ఏఎన్ఐ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు వల్ల వేలాది కొత్త ఉద్యోగాలు వస్తాయనీ, ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న పరిశ్రమల సామర్థ్యాలు పెరుగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నావికాదళంలోని వివిధ ఫ్లీట్లకు చెందిన యుద్ధనౌకలు కార్యకలాపాల సమయంలో ఎల్లప్పుడూ పనిచేయడానికి ఎఫ్ఎస్ఎస్ ఇంధనం, ఆహారం, మందుగుండు సామగ్రి, విడిభాగాలను అందిస్తుంది.
ప్రణాళిక ప్రకారం.. హెచ్‌ఎస్‌ఎల్ దాదాపు ఎనిమిదేళ్లలో అన్ని షిప్‌లను డెలివరీ చేయనుంది. ఒక్కో నౌక దాదాపు 45,000 టన్నుల బరువు ఉంటుంది. హెచ్‌ఎస్‌ఎల్‌ను ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ల నిర్మాణం కోసం ఇండియన్ నేవీ నామినేట్ చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నావికాదళంలో ఇండియా ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!