ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: కోవిడ్ సేఫ్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం

ఈ ఏడాది ప్ర‌ధ‌మార్థంలో ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉన్న‌ది.  మార్చితో గోవా, పంజాబ్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు పాల‌నా కాలం ముగియ‌నుండ‌గా, మే నెల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వాల పాల‌నా కాలం ముగియ‌నున్న‌ది.  క‌రోనా తీవ్ర‌త కార‌ణంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌టించారు.  అక్క‌డి ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. క‌రోనా కేసులు పెరుగుతున్నందున ఆరోగ్య‌శాఖ అధికారుల‌తోనూ సంప్ర‌దింపులు జ‌రిపారు.  క‌రోనా కేసులు పెరుగుతున్నందున కొత్త నిబంధ‌న‌లు తీసుకొస్తున్న‌ట్టు సీఈసీ పేర్కొన్న‌ది.  

Read: స‌ద‌ర‌న్ రైల్వే కీల‌క నిర్ణ‌యం: ఆ రైళ్ల‌లో ప్ర‌యాణం చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే…

5 రాష్ట్రాల్లో మొత్తం 690 అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌రగాల్సి ఉన్న‌ది.  ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే 5 రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు.  మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య పెరిగిన‌ట్టు సీఈసీ తెలియ‌జేసింది.  ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోనే 5 రాష్ట్రాల్లో 2,15,368 పోలీంగ్ కేంద్రాలు ఉన్నాయ‌ని, 24.5 ల‌క్ష‌ల మంది కొత్త ఓట‌ర్లు ఉన్నార‌ని సీఈసీ తెలియ‌జేసింది.  క‌రోనా కార‌ణంగా పోలింగ్ కేంద్రాల్లో ఓట‌ర్ల సంఖ్య‌ను త‌గ్గించిన‌ట్టు సీఈసీ తెలియ‌జేసింది.  అభ్య‌ర్థులు ఆన్లైన్లో నామినేష‌న్ వేసేందుకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నట్టు సీఈసీ తెలియ‌జేసింది.  

Related Articles

Latest Articles