Site icon NTV Telugu

CBI Raids: కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు

Dk Shivakumar

Dk Shivakumar

CBI Raids: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయపు పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని రామనగర జిల్లాలోని కనక్‌పురా, దొడ్డ ఆలహళ్లి, సంతే కోడిహళ్లిలో పలు పత్రాలను పరిశీలించారు.

శివకుమార్‌కు చెందిన ఆయన ఇల్లు, ఇతర ఆస్తులకు సంబంధించిన పేపర్లను తనిఖీ చేసినట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివకుమార్‌పై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సీబీఐ కర్ణాటక హైకోర్టును కోరిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.దర్యాప్తు సంస్థ శివకుమార్‌పై 2020 అక్టోబర్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసు ఇంకా విచారణలో ఉందని, త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని ఇటీవల కోర్టుకు సమర్పించింది.

PFI: పీఎఫ్‌ఐ ట్విటర్ ఖాతా నిలిపివేత.. నిషేధం విధించిన మరుసటి రోజే..

ఎల్లుండి ఉదయం రాహుల్‌ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ సీబీఐ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే డీకే శివకుమార్‌కు అధికారులు నోటీసులు పంపారు. కానీ వ్యక్తిగత పనులున్నందున హాజరుకాలేనని డీకే శివకుమార్ చెప్పారు.

Exit mobile version