Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో లాలూపై సీబీఐ చార్జిషీట్ దాఖలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalu Prasad Yadav: ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌పై ‘‘ల్యాండ్ ఫర్ జాబ్’’ స్కామ్‌లో సీబీఐ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. లాలూతో సహా చార్జిషీట్‌లో మరో 77 మందిని ఉన్నారు. కాంపిటెంట్ అథారిటీ నుంచి ఇంకా అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని సీబీఐ కోర్టు తెలిపింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ అంశాన్ని జూలై 6న పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. గతంలో మే 29న కోర్టు పూర్తి ఛార్జిషీట్‌ను దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది, తగినంత సమయం ఇచ్చినప్పటికీ ఆలస్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
Read Also: Chandrababu Swearing Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ముహూర్తం, వేదిక ఫిక్స్
Also Read
కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ పనిచేసిన సందర్భంలో ఈ స్కామ్ జరిగింది. ఈ కేసులో ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్ సహా ఆయన కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు. సీబీఐ ప్రకారం, రెండవ ఛార్జిషీట్‌లో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి లాలూ, అతని భార్య, కుమారుడు, అప్పటి వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ (డబ్ల్యుసిఆర్) జనరల్ మేనేజర్ (డబ్ల్యుసిఆర్), డబ్ల్యుసిఆర్‌లోని ఇద్దరు చీఫ్ పర్సనల్ ఆఫీసర్లు (సిపిఓలు), ప్రైవేట్ వ్యక్తులు సహా 17 మంది నిందితుల పేర్లు ఉన్నాయి.
2004-09 మధ్యకాలంలో వివిధ రైల్వే జోన్లలో గ్రూప్ డి పోస్టుల కోసం ఉద్యోగ ఆశావహుల నుంచి లాలూ కుటుంబ సభ్యులు ఆస్తులు బదిలీ చేయించుకుని ఆర్థిక ప్రయోజనం పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కీలక ప్రాంతాల్లో ఉన్న భూములను సేకరించేందుకు మంత్రి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కుట్ర పన్నినట్లు తేలింది. మంత్రి కుటుంబ సభ్యులకు, లేదా వారు సూచించిన వ్యక్తుల పేర్ల మీదకు భూమిని బదిలీ చేయడం ద్వారా అభ్యర్థులకు ఉద్యోగాన్ని అందించారు.
తాజావార్తలు
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
-
BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
-
Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
-
Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
-
Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!