NTV Telugu Site icon

Tanmoy Bhattacharya: మహిళా జర్నలిస్టుతో సీపీఎం నేత పాడుబుద్ధి.. ఎఫ్‌ఐఆర్ నమోదు

Tanmoybhattacharya

Tanmoybhattacharya

ప్రజా సేవకుడు అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి. అలాంటిది వాళ్లే మర్యాద తప్పి ప్రవర్తిస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్‌లో ఓ సీపీఎం నాయకుడు పాడు బుద్ధి ప్రదర్శించాడు. ఇంటర్వ్యూకు వచ్చిన ఒక మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో సీపీఎం పార్టీ సీరియస్‌గా తీసుకుని సస్పెండ్ చేసింది. తాజాగా అతగాడిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Rachel Gupta: మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ భారత మహిళదే..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు.. సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తన్మయ్ భట్టాచార్యను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లింది. అయితే తన్మయ్ భట్టాచార్యకు ఏం పాడుబుద్ధి పుట్టిందో.. ఏమో తెలియదు గానీ.. నేరుగా వెళ్లి మహిళా జర్నలిస్టు ఒడిలో కూర్చుకున్నాడు. దీంతో ఆమె ఒకింత షాక్‌కు గురైంది. అనంతరం సోషల్ మీడియాలో వేదికగా తనకు జరిగిన అన్యాయాన్ని పంచుకుంది. తన్మయ్ భట్టాచార్య తనను లైంగికంగా వేధించాడని వాపోయింది. దీంతో సీపీఎం పార్టీ సీరియస్ అయింది. వెంటనే అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి తన్మయ్ భట్టాచార్యను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా సీపీఎం మాజీ ఎమ్మెల్యే తన్మయ్ భట్టాచార్య తనను లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తన్మయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటర్వ్యూ కోసం వెళ్లిన సమయంలో ఆయన తన ఒడిలో కూర్చున్నట్లు ఆమె తెలిపారు.

మహిళా జర్నలిస్టు ఆరోపణలపై తన్మయ్ భట్టాచార్య స్పందిస్తూ.. గతంలో ఇంటర్వ్యూ చేసిన సమయంలో జోక్స్ చేసినట్లు తెలిపారు. తాజా ఆరోపణల విషయాలు తనకు తెలియదన్నారు.

ఇది కూడా చదవండి: Harish Rao : రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు… ప్రజా పీడన

Show comments