Rachel Gupta: మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ భారత మహిళదే..
- మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న భారత మహిళ
- దేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్ నమోదు
- ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రేచల్ గుప్తా
- పంజాబ్ జలంధర్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 25న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్‌ను భారత మహిళ గెలుచుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్ నమోదైంది. దీంతో.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రేచల్ గుప్తా నిలిచారు. పంజాబ్ జలంధర్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్.. 70కి పైగా దేశాలకు చెందిన పోటీదారులను ఓడించింది. 2022లో మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్ టైటిల్ గెలుచుకోగా.. తాజాగా ప్రతిష్టాత్మక మిస్ గ్రాండ్ ఇండియా టైటిట్‌ను సొంతం చేసుకుంది. బ్యాంకాక్‌లోని MGI హాల్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్నారు. వారందరిని వెనక్కి నెట్టి రేచల్ ఈ ఘనత సాధించారు. అయితే.. ఈ విజయంతో రేచల్ ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డును కూడా గెలుచుకుని మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా సరసన చేరింది.
Read Also: Minister Narayana: ఇసుక రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వితే కఠిన చర్యలు..
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
ఈ విజయాన్ని రేచల్ గుప్తా.. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్‌ను గెలుచుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్లో ఆమెకు మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు (10 లక్షల మందికి పైగా). మరోవైపు.. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ సాధించడంతో.. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. రేచల్ విజయం దేశం గర్వించేలా ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా.. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 విజేతగా నిలిచిన రాచెల్ గ్లోబల్ అంబాసిడర్గా ప్రపంచ శాంతి స్థిరత్వంపై ప్రచారం కల్పిస్తారు.
Read Also: Transfers : రాష్ట్రంలో 70 మంది రెవెన్యూ అధికారుల బదిలీ
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?