NTV Telugu Site icon

Nayanthara: నటి నయనతారపై కేసు నమోదు.. శ్రీరాముడిని అగౌరపరిచారని ఫిర్యాదు..

Nayanatara

Nayanatara

Nayanthara: నటి నయనతారపై కేసు నమోదైంది. ఇటీవల విడుదలైన సినిమా ‘అన్నపూరణి’ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో రైట్ వింగ్ సంస్థ ఫిర్యాదు మేరకు నయనతారతో పాటు దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథీ మరియు ఆర్ రవీంద్రన్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌పై కేసు నమోదైంది.

Read Also: Indian Passport: మల్దీవ్స్, భూటాన్‌తో పాటు ఈ దేశాల్లోకి భారతీయులకు “వీసాఫ్రీ” ఎంట్రీ.. లిస్ట్ ఇదే..

ఎఫ్ఐఆర్ ప్రకారం.. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, రాముడిని అగౌరపరిచారని, సినిమా ద్వారా ‘లవ్ జిహాద్’‌ని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నయనతార కెరీర్లో 75వ సినిమాగా వచ్చని అన్నపూరణికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1న ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా మెప్పించలేకోయింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా.. రాముడు కూడా మాంసం తిన్నాడని, ఇది వాల్మీకి అయోధ్య కాండలో ఉంది అని ఓ డైలాగ్ ఉంది. ఇది వివాదాస్పదం అయింది. హీరో ఓ ముస్లిం అయిఉండీ.. హీరోయిన్ ఓ బ్రహ్మణ అమ్మాయిగా ఉండటాన్ని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది లవ్ జీహాద్‌ని ప్రోత్సహించేలా ఉందని ఇప్పటికే తమిళనాడుతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ వివాదంతో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.