Site icon NTV Telugu

Carbide gun: దీపావళి రోజు ‘‘కార్బైడ్ గన్’’ విషాదం.. కంటిచూపు కోల్పోయిన 14 మంది చిన్నారులు..

Carbide Gun

Carbide Gun

Carbide gun: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రజలు తమ కుటుంబాలతో పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, కొందరికి మాత్రం దీపావళి విషాదాన్ని మిగిల్చింది. కంటిచూపు కోల్పోయేలా చేసింది. ‘‘కార్బైడ్ గన్’’ వల్ల మధ్యప్రదేశ్‌లో 122 మంది పిల్లలు గాయపడ్డారు. వీరిలో 14 మంది కంటి చూపు కోల్పోయారు. కేవలం మూడు రోజుల్లోనే వీరంతా గాయపడ్డారు. ఈ కార్బైడ్ గన్‌ను ‘‘దేశీ ఫైర్ క్రాకర్ గన్’’గా కూడా పిలుస్తారు.

Read Also: Chiranjeevi : చిరంజీవి ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాడు..?

వీటిపై మధ్యప్రదేశ్‌లో నిషేధం ఉన్నా కూడా, దీనిని ఉల్లంఘించి కొంత మంది విక్రయించారు. ముఖ్యంగా, విదిశ జిల్లాలో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు రిపోర్ట్ అయ్యాయి. రూ. 150-200 మధ్య దొరికే ఈ కార్బైడ్ గన్ బాంబుల వలే పేలుతున్నాయి. విదిషలో ఈ గన్‌లను విక్రయించిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, గ్వాలియర్ ఇలా అన్ని నగరాల్లోని ఆస్పత్రుల్లోని ఐ వార్డులు నిండిపోయాయి. భోపాల్‌లోని హమీడియా ఆస్పత్రిలో 72 గంటల్లో 26 మంది పిల్లలు చేరారు.

వైద్యులు మాట్లాడుతూ.. ఈ పరికరం వల్ల కళ్లకు ప్రత్యక్ష నష్టం కలుగుతుందని చెప్పారు. దీని పేలుడు తీవ్రత కంటిలోని రెటీనాను కాల్చే లోహ శకలాలు, కార్బైడ్ ఆవిరిని విడుదల చేస్తాయని హెచ్చరించారు. పిల్లల కళ్లు పగిలిపోయి శాశ్వత అంధత్వానికి దారి తీసే అనేక కేసులు నమోదైనట్లు వారు చెబుతున్నారు. ప్లాస్టిక్ లేదా టిన్ పైపుల్ని ఉపయోగించి కార్బైడ్ గన్ తయారు చేసి, వాటిలో గన్ పౌడర్, అగ్గిపుల్లల పొడి, కాల్సియం కార్బైడ్ నింపి, వాటిని వెలిగిస్తారు. దీంతో ఒక్కసారిగా రసాయన చర్య జరిగిన పెద్ద శబ్ధంతో పేలుడు సంభవిస్తుంది.

Exit mobile version