Baba Ramdev: కోవిడ్-19 మహమ్మారి తర్వాత దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరిగిందని ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ శనివారం అన్నరు. గోవాలోని మిరామార్ బీచ్ లో పతంజలి యోగ్ సమితి పేరుతో మూడురోజుల పాటు యోగా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు. కోవిడ్ తర్వాత క్యాన్సర్ చాలా పెరిగిందని.. ప్రజలు కంటి చూపును, వినికిడి శక్తిని కోల్పోతున్నారని అన్నారు.
Read Also: NIA Raids: పీఎఫ్ఐ టార్గెట్‌గా రాజస్థాన్‌లో ఎన్ఐఏ సోదాలు..
భారతదేశం గ్లోబల్ సెంటర్ ఆఫ్ వెల్‌నెస్‌గా ఉండాలన్నది మన ప్రధాని నరేంద్ర మోదీ కల అని, గోవా వెల్‌నెస్ కేంద్రంగా ఉండాలనేది నా కల అని రామ్ దేవ్ అన్నారు. పర్యాటకులు గోవాను సందర్శించడం కోసం మాత్రమే కాకుండా, రక్తపోటు, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, ఇతర వ్యాధులకు చికిత్స పొందాలని అన్నారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికతకు గోవా పర్యాటక కేంద్రంగా మారాలని ఆయన చెప్పారు.
గోవాలో పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉన్న రెండు నెలల్లో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించగలమని.. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారని తెలిపారు. ఆయుర్వేదంలోని పంచకర్మను తమ సంస్థల్లో ప్రవేశపెట్టాలని, తమతో ఉండే పర్యాటకులకు యోగాను పరిచయం చేయాలని ఆయన హోటల్ పరిశ్రమను కోరారు. గోవా తిని, తాగేందుకు మాత్రమే ఉండకూడదని.. జీవితం అంటే తినడం, తాగడం, చనిపోవడం మాత్రమే కానది అన్నారు. యోగా, నేచురోపతి రంగాల్లో రామ్‌దేవ్ ఆధ్వర్యంలో బృందం చేస్తున్న పరిశోధనలను గోవా సీఎం ప్రమోద్ సావంత్ కొనియాడారు. గోవాను యోగభూమిగా మార్చేందుకు రాష్ట్రప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు.